Ration Cardకేవైసీ చేసుకోవడానికి రేషన్ కార్డ్ ఉన్న కుటుంబ యజమానితోపాటు ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ‘ఈ పాస్’ మిషన్‌లో మళ్లీ వేలిముద్రలు వేయాలి.
వేలిముద్ర తీసిన తర్వాత అతని ఆధార్ కార్డు నంబర్‌తో పాటు రేషన్ కార్డు నంబర్ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత గ్రీన్ లైట్ వచ్చి KYC అప్డేట్ పూర్తవుతుంది. రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే…
రేషన్ సరకులు పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో, కేవలం కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులకే బియ్యం అందాలని తెలంగాణలో రేషన్‌కార్డుల వెరిఫికేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రేషన్ కార్డ్ కేవైసీని ప్రభుత్వం చేపట్టింది. ‘ఈ పాస్ యంత్ర’ ద్వారా ప్రతీ లబ్ధిదారుడు కేవైసీ చేసుకోవాలని గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం కూడా ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దీనికి గడువును విధించారు అధికారులు. రేషన్‌కార్డు లబ్ధిదారులు జనవరి 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందులో భాగంగానే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలలుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్న విషయం తెలిసిందే.
ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, ఐ రిష్ వంటి గుర్తింపును తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి ఈ ప్రక్రియ 70.80% పూర్తయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 87.81% నమోదుతో ప్రథమ స్థానంలో ఉంది. అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 54.17% పూర్తయింది. దీంతో ఈ-కేవైసీకి డెడ్‌లైన్ విధిస్తూ అధికారులు ఉత్వర్వులు జారీ చేశౄరు.
కేవైసీ ఎలా చేసుకోవాలంటే..
రేషన్ కార్డు కేవైసీ చేసుకోవడానికి రేషన్‌కార్డు ఉన్న కుటుంబ యజమానితోపాటు ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ‘ఈ పాస్’ మిషన్‌లో మళ్లీ వేలిముద్రలు వేయాలి. వేలిముద్ర తీసిన తర్వాత అతని ఆధార్ కార్డు నంబర్‌తో పాటు రేషన్ కార్డు నంబర్ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత గ్రీన్ లైట్ వచ్చి KYC అప్ డేట్ పూర్తవుతుంది. రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే, వినియోగదారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు సరిపోలడం లేదని అర్థం. దీంతో రేషన్ కార్డ్ నుంచి ఒక యూనిట్‌ను తొలగిస్తారు. రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉన్నాయో, వారంతా ఒకే సమయంలో కేవైసీ కోసం రేషన్ దుకాణానికి వెళ్లాలి.