జగన్నాటక దగా డీఎస్సీ కి బ్రేక్ పడింది :మాజీ మంత్రి గంటా

జగన్నాటక
Spread the love

అంతా మీకు తెలిసే జరిగింది,అంతా మీరు అనుకున్నట్లే జరిగింది ముఖ్యమంత్రి గారు.ఎన్నికల ముందు ఇచ్చిన మీ “జగన్నాటక” దగా డీఎస్సీ కి బ్రేక్ పడింది.

విశాఖ : అంతా మీకు తెలిసే జరిగింది,అంతా మీరు అనుకున్నట్లే జరిగింది ముఖ్యమంత్రి గారు.ఎన్నికల ముందు ఇచ్చిన మీ “జగన్నాటక” దగా డీఎస్సీ కి బ్రేక్ పడింది.

ఐదేళ్ల పాటు నిద్రపోయి ఎన్నికలకు ముందు కోడ్ వస్తుందని తెలిసినా అడ్డగోలు రూల్స్ పెట్టి డీఎస్సీ ప్రకటన ఇచ్చి జగన్నాటకానికి తెరలేపారు.

నిరుద్యోగులు టెట్ అని,డీఎస్సీ అని , శిక్షణ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు.

ఎన్నికల ముందు డీఎస్సీ అంటూ హడావుడి చేసి నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేసుకున్నారు.

మీరు చేసిన కుట్ర ప్రతి నిరుద్యోగికి అర్థమైపోయింది. ఈ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి.

నారా చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో ముఖ్యమంత్రి గా 8 సార్లు డీఎస్సీని తీసుకొచ్చారు.

మా హయాంలో

2014లో… 9,061 పోస్టులతో..

2018లో… 7,729 పోస్టులతో…

మెగా DSCలు ప్రకటించి వేలాది మంది నిరుద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది.

రాష్ట్రంలో మిగిలి ఉన్న అన్ని ఉపాద్యాయ ఖాళీలుతో మెగా DSC ఇచ్చి, మీ ఉద్యోగాలను మీకు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకుంటారు.

రేపు అధికారంలోకి రాబోతుంది తెలుగుదేశం – జనసేన – బీజేపీ ప్రభుత్వమే.

ఇలాంటి ఫేక్ నోటిఫికేషన్ వలన రాష్ట్రంలోని నిరుద్యోగులు అధైర్య పడాల్సిన అవసరం లేదు.

భవిష్యత్తు మనదే.

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఈసారి తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలు పైనే సంతకం చేస్తా అని హామీ ఇచ్చారు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు అన్నారు.

జగనాసుర పాలనకి చేరమగీతం పాడాలని ప్రజలకి పిలుపునిచ్చారు.

Back To Top