ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తొలిసారి స్పందించిన ప్రభాకర్ రావు..

ఫోన్ ట్యాపింగ్ కేసు
Spread the love

ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(SIB Ex Chief Prabhakar Rao) తొలిసారి ఈ కేసుపై స్పందించారు. తన వాదనలను అఫిడవిట్ ద్వారా వివరించారు ప్రభాకర్ రావు. ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు(Red Corner Notice) జారీ చేసే అంశంపై కోర్టులో వాదనలు జరిగాయి.

హైదరాబాద్, మే 08: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(SIB Ex Chief Prabhakar Rao) తొలిసారి ఈ కేసుపై స్పందించారు. తన వాదనలను అఫిడవిట్ ద్వారా వివరించారు ప్రభాకర్ రావు. ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు(Red Corner Notice) జారీ చేసే అంశంపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అఫిడవిట్ ద్వారా తన వివరణ ఇచ్చారు ప్రభాకర్ రావు.

ఫోన్ ట్యాపింగ్ కేసు
ఫోన్ ట్యాపింగ్ కేసు

తాను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేస్తానని అన్నారు. అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ల పర్యవేక్షణలో పనిచేశానని ప్రభాకర్‌రావు చెప్పారు. తనపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్ష ఉంటుందన్నారు. తాను ఎలాంటా తప్పుడు పనులకు పాల్పడలేదని ప్రభాకర్‌రావు వివరించారు. కారణం లేకుండానే తనను నల్గొండ నుంచి బదిలీ చేశారని పేర్కొన్నారు. చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ కులం, తన కులం ఒక్కటే అయినందునే.. తనను నిందిస్తున్నారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తాను ప్రస్తుతానికి క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని.. క్యాన్సర్ చికిత్స పూర్తయిన తరువాత ఇండియాకు వస్తానని కోర్టుకు తెలిపారు ప్రభాకర్ రావు.

Back To Top