దేవర, వార్ 2 సినిమాలతో చాలా బిజీగా ఉన్న జూ.ఎన్టీఆర్ మంగళవారం వాటన్నింటికీ బ్రేక్ ఇచ్చారు. తన నూతన కారు రిజిస్టేషన్ కోసం ఖైరతాబాద్‌ఆర్టీఓ కార్యాలయానికి వచ్చారు.
గ్లోబల్ స్టార్ (ManOfMassesNTR) జూ.ఎన్టీఆర్ (#JrNTR) ఈ రోజు ఖైరతాబాద్‌లో సందడి చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దేవర(#Devara ), వార్ 2 సినిమాలతో చాలా బిజీగా ఉన్న ఆయన మంగళవారం వాటన్నింటికీ బ్రేక్ ఇచ్చి తన సొంత పనులు చక్క పెట్టుకున్నారు.
తను కొత్తగా కొనుగోలు చేసిన మెర్సిడెజ్ బెంజ్ మేబ్యాక్ మోడల్ కారు (luxurious and stylish black Mercedes-Benz Maybach S – Class car) రిజిస్టేషన్ కోసం ఖైరతాబాద్‌లోని ఆర్టీఓ కార్యాలయానికి వచ్చారు. కాగా బహిరంగ మార్కెట్‌లో ఈ కారు ధర రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు ఉంది.
ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు జూ.ఎన్టీఆర్ (#JrNTR)తో ఫార్మాలిటీస్ పూర్తి చేయించి అతనితో సంతకాలు చేయించుకున్నారు. అనంతరం అభిమానులు అక్కడికి పోటెత్తకముందే ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.