👉 కార్పోరేట్ కు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు.
👉 జి .ఓ.లకే పరిమితమైన జీవంలేని ప్రభుత్వాల లక్ష్యాలు.
👉మధ్యతరగతి చదువును మడచిపెట్టి కార్పోరేటుకు కొమ్ముకాస్తున్న వైనం.
👉అంగన్ వాడీలిక ఆగమాగం పసిపిల్లను ప్రైవేటు వైపు పంపడమే ప్రభుత్వాల లక్షమా?
అక్షరాని కో లక్ష – లక్ష్యాలు లేని విద్య ఫ్రీ చదువును ఫ్రీస్టేజీగా మార్చిన వైనం. ప్రారంభంలో ఆడంబరం చిట్టచివరికి అట్టహాసం మధ్యలో డొల్ల పైచాచికంగా మారిన పై పై చదువులు యాంత్రిక విధానాలలో ప్రభుత్వ పాలన నేటి ప్రభుత్వాలు ప్రభుత్వ విధానాలు వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. క్రొత్త క్రొత్త విధానాలను ప్రవేశపెడుతూ ప్రజలను ఇక్కట్లలోకి తోసేస్తున్నాయి. జి.ఓ. లకే పరిమితమైన జీవంలేని ప్రభుత్వంగా మారుతున్నాయిని విద్యావేత్తల ఆరోపణలు ఉన్నాయి.
ఈ విధానాల వల్ల మధ్యస్థాయి వ్యవస్థలకు ఇబ్బందికరంగా మారుతుందని మరియు కార్పోరేట్ వ్యవస్థలను కాపాడుతుందని ఆరోపణలు లేకపోలేదు. దీనికి ఉదాహరణగా చూసినట్లయితే జి.ఓ.యం.యస్.నెం: 41, జి.ఓ.యం.యస్.నెం: 74 ల ప్రకారం.. నర్సరీనుండి అప్పర్ గార్డెన్, తరగతులకు పర్మిషన్లు పొందవచ్చని అన్ని ప్రవేట్ విద్యాసంస్థలకు అనుమతి తీసుకోవాలని రూ.10,000/-లను తనిఖీ రుసుముగా వసూలు చేయడమేంటని మేధావులు ఆశ్చర్యపోతున్నారు.
అసలు ఎంత వయస్సున్న పిల్లలు పాఠశాలలకు వెళ్ళాలని విద్యాహక్కు చట్టం ప్రకారంగాని, బాలలహక్కుల చట్టప్రకారం గాని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపణలు లేకపోలేదు. పాఠశాలలకు సర్సరీనుంచి యు.కె.జీ వరకు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చినప్పుడు కార్పోరేట్ యొక్క ఫీజులను మధ్య తరగతి ప్రజలు అక్షరా లు నేర్చుకోవడానికి లక్షల రూపాయలు కట్టగలరా? ఒకవేళ వారికి స్థాయికి తగ్గ మధ్యతరగతి పాఠశాలకు తమ పిల్లలను పంపినప్పటికీ ఆయా మధ్య తరగతి పాఠశాలలు పర్మిషన్ నిమిత్తం రూ.. 10,000/- లు, మరియు వాటి సంబంధిత ఖర్చులు కట్టగలవా? కట్టినా మధ్యతరగతి విద్యార్థుల స్థాయికి తగ్గ ఫీజు వుండదని విద్యావేత్తల అభిప్రాయం లేకపోలేదు.
ఒకవేళ ఈ విధానంతో 2సంవత్సరాల పైబడి పిల్లలు ప్రవేటు బాట పడితే అంగన్వాడీలు అగమేనా?
అని ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ ప్రస్తుతం అంగన్వాడీలలో నమోదుచేసుకున్న పిల్లలు ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారన్న ఆరోపణలతో ఈ విధానాలను ప్రవేశపెట్టడం ఒక కారణమైతే మధ్యతరగతి పాఠశాలల వల్ల ప్రభుత్వాలకు లాభం లేక మధ్యతరగతి పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసి కార్పోరేట్ విధానాన్ని కొనసాగించాలని ఆలోచనలో ప్రభుత్వ విధానాలు సూచిస్తున్నాయని ఆరోపణలు లేకపోలేదు.
ఈ ప్రభుత్వాల విధానాలను ఆసరగా చేసుకొని కార్పోరేటు వ్యవస్థలు ప్రారంభంలో ఆడంబరంగా ప్రజలను ఆకర్షించి చిట్టచివర అట్టహాసాలను చూపించడంతప్ప , పిల్లల్లో జాతీయ భావాలను పెంపొందించేది మరియు వారికి ప్రాథమిక విద్యను సరిగా అందించడం లేదని,మరియు పిల్లలను వారి వారి వ్యక్తిగత ప్రయోజనాలకు తప్ప, తల్లిదండ్రులు, సామాజికవేత్తలు కోరుకున్న లక్ష్యాలను చేరడం లేదని భావిస్తున్నారు. వారి పిల్లలు వేసుకున్న స్కూలు దుస్తులలో తప్ప పరీక్షలలో ప్రతిభ కనపడరని ఆందోళనకు గురౌతున్నారు. ప్రజలలో రుగ్మతలను పోగొట్టి ప్రభుత్వ పాఠశాలల బాట పట్టేవిధంగా ప్రభుత్వాలు బడిబాట కార్యక్రమానికి వేల రూపాయలు ఖర్చు పెట్టినా ఫలితం కనబడుటలేదని, అక్కడక్కడ ప్రభుత్వ పాఠశాలలో, బడ్జెట్ పాఠశాలల్లోనూ మంచి విద్య ఉన్నప్పటికీ ఆ పాఠశాలకి పంపించడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారు , డబ్బున్న వారు కార్పొరేట్ పాఠశాలలో చదవాలని భావన ప్రజల్లో నాటక పోయింది.
పైపై చదువుల వైపు తల్లిదండ్రులు మోసపోతున్నారని చదువును వదలి ప్రిస్టేజీ చదువుకు మక్కువ చూపుతున్నారని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. యాంత్రికవిధాన పరిపాలన కొనసాగినంతకాలం ప్రభుత్వం విధానాలలో మార్పులు రావు. ప్రాంతాలను బట్టి ప్రజల అవసరాలను బట్టి క్షేత్రస్థాయి అధికారులు నిస్వార్థ, నిర్భయ, ప్రజ్ఞశాచితత్వాన్ని ప్రదర్శించి పరిపాలన చేసేవిధానాన్ని ప్రభుత్వాలు ప్రవేశపెట్టారు కాని నేడు దానికి భిన్నంగా ఎక్కడో జరిగిన సంఘటనలను మరియు “గాడ్ ఆఫ్ నేచర్ ” క్రింద సంభవించినటువంటి సందర్భాలను సహితం మరియు కాలం చెల్లిన నిబంధనలను జారీ చేయడం వలన ప్రజలకు ఫలితాలు అందవని విద్యావేత్తల అభిప్రాయం….
జి. రామకృష్ణా రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్