ప్రధాని అభ్యర్థిగా రాహుల్!

రాహుల్
Spread the love

అఖిలేష్ యాదవ్ క్లారిటీ..! సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. జూన్‌1తో దేశంలో ఏడు విడతల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. జూన్‌1తో దేశంలో ఏడు విడతల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఎన్డీయే కూటమి నుంచి నరేంద్రమోదీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిని బహిరంగంగా ప్రకటించలేదు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఈ అంశంపై ఎన్నికల షెడ్యూల్‌కు ముందు చర్చించినప్పటికీ ఏకాభిప్రాయం రాలేదు.

దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ అంశాన్ని బీజేపీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేరని, తమ ప్రధాని అభ్యర్థి ఎవరో నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని బీజేపీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. మరోవైపు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికి ఒక ప్రధాని చొప్పున ఐదేళ్లకు ఐదుగురు ప్రధానమంత్రులు ఉంటారంటూ పీఎం నరేంద్రమోదీ ఎద్దెవాచేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారా అనే ప్రశ్నపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు.

రాహుల్
రాహుల్

అఖిలేష్ ఏమన్నారంటే..

కేంద్రంలో జూన్4 తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ రథం పూర్తిగా కూలిపోయిందని, ఆ పార్టీకి 140 సీట్లు కూడా రావన్నారు. రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న గాంధీని ప్రధానిని చేస్తారా అన్న ప్రశ్నకు మా వ్యూహం ఇప్పుడే చెప్పబోమని అఖిలేష్ యాదవ్ తెలిపారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, లక్నోలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి కౌంట్‌డైన్ ప్రారంభమైందని చెప్పారు. బీజేపీ ఎంత ఎత్తుకు వెళ్లాలో అంతే ఎత్తుకు వెళ్లిందని, ప్రస్తుతం ఎత్తు తగ్గే ప్రక్రియ మొదలైందన్నారు. బీజేపీ నిరంతరం పతనం అవుతోందని, బీజేపీ రథం పూర్తిగా మునిగిపోయిందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తప్పకుండా 79 సీట్లు గెలుస్తున్నామని అఖిలేష్ జోష్యం చెప్పారు. దేశంలో ఇండియా కూటమి మెజార్టీ సీట్లు గెలవబోతుందన్నారు.

రాయ్‌బరేలీలో రాహుల్ ప్రధాని నినాదం..

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీచేస్తున్నారు. ఈక్రమంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాహుల్ ప్రధాని అంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై అఖిలేష్ స్పందిస్తూ సరైన సమయంలో తమ వ్యూహం తెలుస్తుందని, ముందుగానే ఏమి చెప్పలేమన్నారు. బీజేపీని ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించబోతున్నారని, ఆ విషయం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో దేశం మొత్తానికి తెలుస్తుందన్నారు.

Back To Top