సీతా ఫలాలు…వాటి ఫోషక విలువలు.

సీతా ఫలాలు
Spread the love

సీతా ఫలాలు పచ్చిగా (కాయగా)ఉన్నప్పుడు దీనిలో ఔషధవిలువలు మరింత ఎక్కువని చెబుతారు.
వంద గ్రా. సీతాఫలంలో 94 క్యాలరీలు వస్తాయి. ఆపిల్(56), జామ(49), మామిడి(70), బొప్పాయి(32)… వంటి పండ్లతో పోలిస్తే ఇందులో క్యాలరీలు ఎక్కువ. కాబట్టి తక్కువ బరువుతో బాధపడేవాళ్లు ఆరోగ్యంగా బరువు పెరగొచ్చు. నీరసంగా ఉన్నప్పుడు ఓ సీతాఫలం తింటే వెంటనే శక్తిమంతంగా అనిపిస్తుంది.


సీతా ఫలాలు పచ్చిగా (కాయగా)ఉన్నప్పుడు దీనిలో ఔషధవిలువలు మరింత ఎక్కువని చెబుతారు.
వంద గ్రా. సీతాఫలంలో 94 క్యాలరీలు వస్తాయి. ఆపిల్(56), జామ(49), మామిడి(70), బొప్పాయి(32)… వంటి పండ్లతో పోలిస్తే ఇందులో క్యాలరీలు ఎక్కువ. కాబట్టి తక్కువ బరువుతో బాధపడేవాళ్లు ఆరోగ్యంగా బరువు పెరగొచ్చు. నీరసంగా ఉన్నప్పుడు ఓ సీతాఫలం తింటే వెంటనే శక్తిమంతంగా అనిపిస్తుంది.

సీతా ఫలాల్లో అధికంగా ఉండే విటమిన్-సి సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కణజాల బలహీనతనీ, ఆస్తమానూ తగ్గిస్తుందట.

  • ఈ పండులో ఉండే ఆల్కలాయిడ్లూ ఎసిటోజెనిన్‌లు క్యాన్సర్ సంబంధిత, మూత్రపిండాల వ్యాధులు రాకుండా కాపాడతాయి.
  • వీటిల్లోని పీచు కాలేయ, పేగు వ్యాధుల నుంచి కాపాడుతుంది. జీర్ణక్రియకి ఎంతో మంచిది.
  • సీతాఫలాల్లో అధికంగా ఉండే బి-విటమిన్, మెదడులో విడుదలయ్యే గాబా న్యూరాన్ అనే రసాయనాన్ని తగ్గిస్తుందట. ఫలితంగా ఒత్తిడీ, డిప్రెషన్, చికాకూ వంటివి తగ్గుతాయి.
  • సీతా ఫలాలు లో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనతని తగ్గిస్తుంది.
  • వీటిల్లోని రిబోఫ్లేవిన్, విటమిన్-సిలు కంటిచూపునీ మెరుగుపరుస్తాయి. ఇవి గర్భస్థ శిశువు చర్మం, కళ్లు, జుట్టు పెరుగుదలకూ తోడ్పడతాయి. ఈ పండుని పటికబెల్లంతో కలిపి తింటే పాలిచ్చే తల్లులకు పాలు బాగా పడతాయి.
  • మెగ్నీషియం, కాల్షియంలు ఎముకపుష్టిని పెంచుతాయి. ఆర్థ్రయిటిస్‌ను తగ్గిస్తాయి. పొటాషియం బీపీని తగ్గిస్తుంది.
  • ఇందులోని నియాసిన్ చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకూ తోడ్పడుతుంది.
  • అన్నింటికన్నా ఇందులో అధికంగా ఉండే కాపర్, థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి ఎంతో అవసరం. ఇది జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. గర్బిణులకూ కాపర్ ఎంతో అవసరం. నెలలు నిండకుండా ప్రసవించడాన్ని తగ్గిస్తుంది.
  • అవకాడో, జామ, బొప్పాయిల్లో ఎక్కువగా ఉండే ఫొలేట్ (బి-9) విటమిన్ సీతాఫలంలోనూ ఎక్కువే. అందుకే గర్భిణులకు ఈ పండు ఎంతో మంచిది. వేవిళ్లతో బాధపడేవాళ్లకు వికారాన్నీ తగ్గిస్తుంది.
  • ఇందులోని ఎసిటోజెనిన్ రసాయనాలు చర్మ క్యాన్సర్ల నుంచీ రక్షిస్తాయి. ఈ పండ్లు దొరికినన్నాళ్లూ రోజూ తినడంవల్ల శరీరం ముడుతలు పడకుండా ఉండటంతోబాటు కాంతిమంతంగా మెరుస్తుంది. చూశారుగా మరి… ఎన్ని ఉపయోగాలో… ‘సీతాఫలాల సీజన్ ఎప్పడూ ఉంటే ఎంత బాగుంటుందో’ అని మీకూ అనిపిస్తోంది కదూ!..-
బుక్కా ఈశ్వరయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top