కాయ్ రాజా కాయ్ … వనపర్తిలో బెట్టింగ్ బంగారు రాజులు !

బెట్టింగ్
Spread the love

సొంత యాప్స్ తో గుట్టుగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా.

బంతి బంతికి బెట్టింగ్,టాస్ కి సైతం బెట్టింగ్.

ఒక్కో మ్యాచ్ కి మూడు నుండి ఐదు కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుందని సమాచారం.

ఫోర్ కొడితే రూ.50వేలు, సిక్స్ కొడితే రూ.లక్ష.

మూడు పువ్వులు ఆరు కాయలుగా బెట్టింగ్.

సంవత్సరానికి సుమారు 150 కోట్ల టర్నోవర్ ?

ఓడిపోయిన వారితో ప్రామిసరీ నోట్లు రాయిస్తున్న వైనం.

యువతని మద్యానికి,మాదకద్రవ్యాలకు బానిసలుగా చేస్తున్న క్రికెట్ బెట్టింగ్.

ఇల్లాలి మెడలో తాళిబొట్లు సైతం తాకట్టు పెట్టి బెట్టింగ్ ఆడుతున్న బెట్టింగ్ ప్రియులు.

అప్పులు అధిక రుణాలు బెడదతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత.

తాజాగా వనపర్తిలో ఒక వ్యాపారి దుకాణంలోకి చొచ్చుకెళ్లి దాడి చేసి డబ్బులు చెల్లించకపోతే చంపేస్తాం అని బుకీలు బెదిరించినట్టు సమాచారం.

వనపర్తిలో కొరవడిన పోలీసు నిఘా రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు!

హైదరాబాద్ (చైతన్యగళం) స్పెషల్ డెస్క్: ఫోర్ కొడితే రూ.50 వేలు సిక్స్ కొడితే వనపర్తి లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న తీరు ఇది.వనపర్తి అనగానే వనపర్తి కోట గుర్తుకొస్తుంది రాష్ట్రంలోనే మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాల వనపర్తి లోనే ప్రారంభమయింది.ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యావంతులయ్యారు నేడు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇక్కడే విద్యాభ్యాసం సాగించారు.ఇదంతా గతం ఇప్పుడు వనపర్తి అనగానే బెట్టింగ్ కి పుట్టిల్లుగా మారింది. బెట్టింగ్ బుకీలు అంతా వనపర్తి లో సిండికేట్ గా ఏర్పడి ఒక మాఫియాగా మారారు.

మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం బెట్టింగ్ ఆడిన వారిని సైతం వేధింపులకు గురిచేసి అధిక వడ్డీలకు డబ్బులు వసూలు చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ లో బంతి బౌండరీ దాటితే ఫోర్ అంటారు ఫోర్ కొడితే జట్టుతో పాటు ఆటగాడి ఖాతాలో నాలుగు పరుగులు వచ్చి చేరుతాయి కానీ ఇప్పుడు టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఫోర్ పడింది అంటే కొందరి ఖాతాల్లోకి 50 వేలు వచ్చి పడుతున్నాయి. మరో మ్యాచ్లో చివరి ఓవర్ చివరి బంతికి సిక్సర్ దీంతో ఆ జట్టుకు వచ్చేవి ఆరు బరువులు మాత్రమే కానీ కొందరి ఖాతాల్లో రూ లక్షల్లో వచ్చి పడుతున్నాయి.

స్టేడియంలో ఫోర్, సిక్సర్ కొడితే ఎవరికో 50 వేలు, లక్ష రావటం ఏంటి అనుకుంటున్నారా?
క్రికెట్ మ్యాచ్ లని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న బెట్టింగ్ దందా ఇది. క్రికెట్ ప్రియులు కొందరు వరల్డ్ కప్ ని చూసి ఆస్వాదిస్తుంటే మరికొందరు మ్యాచులపై బెట్టింగ్ కి పాల్పడుతున్నారు.

బెట్టింగ్
బెట్టింగ్


పెద్ద సంఖ్యలో బెట్టింగ్ యాప్స్:


ఏటా ఐపిఎల్ సీజన్ క్రికెట్ వరల్డ్ కప్ సీజన్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతుంది బెట్టింగ్ అనేది ఏదో ఒక అంశానికే పరిమితం కాలేదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఒక మ్యాచ్లో మొత్తం స్కోర్,ఇన్నింగ్స్ వికెట్లు,వ్యక్తిగత స్కోర్,విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ వంటి ముఖ్యమైన ఆటగాళ్లు ఎన్ని పరుగులు చేస్తారు,బౌలర్లు వేసే ఒక్క ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయి,ఇన్నింగ్స్ చివరి బంతికి ఎన్ని పరుగులు కొడతారు,మొత్తం మ్యాచ్లో ఎన్ని ఫోర్లు,ఎన్ని సిక్స్ లు కొడతారు?పవర్ ప్లే లో ఎన్ని పరుగులు వస్తాయి? మ్యాచ్లో ఎన్ని వైడ్లు, ఎన్ని నోబాల్స్ వేస్తారు? ఇలా ప్రతి విషయంలోనూ బెట్టింగ్ నడుస్తుంది.

కేవలం మ్యాచ్ జరుగుతున్నప్పుడే కాకుండా ప్రారంభానికి ముందు నుంచే బెట్టింగ్లు మొదలవుతుంటాయి అని జట్టు తరఫున ఆడే చివరి 11 మంది ఎవరు అనే విషయంపై కూడా పందాలు కాస్తుంటారని తెలిసింది. ఈ విషయంలో ప్రత్యేకంగా కొన్ని యాప్స్ ని రూపొందించి వాటిలో నేరుగా బెట్టింగ్ కొనసాగుతోంది చివరికి టాస్ విషయంలో కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇది కేవలం క్రికెట్ వరల్డ్ కప్ ఐపీఎల్ కి మాత్రమే పరిమితం అవ్వలేదు. విదేశీ లీగ్స్ అయినటువంటి బిగ్ బాస్,పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్,బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్,మహిళా క్రికెట్ మరియు ప్రో కబడ్డీ,ఫుట్బాల్ లాంటి ఆర్డర్లకు సైతం వనపర్తి కేంద్రంగా బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద బుకి వనపర్తి జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ అతనితోపాటు మరి కొంతమంది బుకీలను ఇక్కడ ప్రత్యేక ఆప్ లలో దందా కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నాడని వనపర్తిని బుకిలందరూ కలిసి బెట్టింగ్ కి కేరాఫ్ అడ్రస్ గా మార్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈరోజు వనపర్తి లో జరిగిన ఒక సంఘటన అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి ఒక యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం బెట్టింగ్ కి పాల్పడేవాడన్నట్టు తెలుస్తుంది. కొన్ని లక్షలకు పోగొట్టుకున్న యువకుడు కష్టం మీద ఆ వ్యసనాన్ని వదిలించుకున్నాడు కాగా మూడు సంవత్సరాల క్రితం బెట్టింగుల్లో లక్ష రూపాయలు బాకీ ఉన్నాడు అనే నేపంతో ఈరోజు ఒక బుకీ అతని దుకాణం లోకి చొచ్చుకెళ్లి తీవ్రంగా దుర్భాషలాడుతూ రెండు రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే చంపేస్తాం అని బెదిరించినట్టు తెలుస్తోంది. వ్యసనాలను వదిలించుకున్న వారిని సైతం బుకీలు బలవంతంగా ఆటకు బానిసలను చేస్తున్నారు ఈ విషయంపై పోలీసులు లోతైన విచారణ జరిపి బెట్టింగ్ మాఫియాని రూపు మాపాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వనపర్తి బుకీలు బెట్టింగ్ ద్వారా సంవత్సరానికి సుమారు 150 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది అనే విషయం సంచలనం సృష్టిస్తుంది. కాగా బెట్టింగ్లో నష్టపోయిన వ్యక్తులని బుకీలు గోవా కి తీస్కొని వెళ్లి విందు,వినోదంతో సదరు వ్యక్తిని ఉత్సాహపరిచి మళ్లీ బెట్టింగ్ లో పాల్గొనే విధంగా చేస్తున్నారు అని సమాచారం.

Back To Top