సీఎం గారు- స్పందించాలి
ఇల్లందులోని శివాలయం అభివృద్ధి చెందేది ఎన్నడు?
స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఇల్లందులోని శివాలయం
అభివృద్ధికి చొరవ తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఇల్లందు/ కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, నవంబర్ 2 ( న్యూస్ బ్యూరో):
స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఇల్లందులోని శివాలయం అభివృద్ధికి చొరవ తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. దీనికి సంబంధించి దేవదాయ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.
శివాలయం దుస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది . ఇప్పుడు భక్తుల మధ్యలో ఇది ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్ . ఈ ఆలయానికి పాలకవర్గానికి చైర్మన్గా ఉన్న పట్టాభి ఆలయ అభివృద్ధిపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఈ పరిణామాల నేపథ్యంలోనే దేవదాయ శాఖ దృక్యం చేసుకొని లోతుగా దర్యాప్తు జరపాలని, పాలకవర్గాన్ని సమూలంగా మార్చి ఇల్లందులోని శివాలయం అభివృద్ధికి దోహదపడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి మాదారం స్టిల్ ప్లాంట్క కు ఇచ్చిన దానిలో దేవుని మాన్యం 100ఎకరాలకు గాను నష్ట పరిహారం ఎక్కడ ? అనేది సందేహాస్పదంగా మారింది.ఆ డబ్బులు దేవదాయ శాఖ కు వెళ్లిందా లేదా పర్స శాఖకు వెళ్లిందా అనే సందేహాలు ఉన్నాయని అభిప్రాయం సర్వత్రా నెలకొన్నది.
630ఎకరాల దేవుని మాన్యం ద్వారా ప్రతి సంవత్సరం వస్తున్న ఎకరానికి 1000రూపాయల కౌలు దేవదాయ శాఖ అకౌంట్లో వెళ్లిందా లేకపోతే అదికూడా సొంత అకౌంట్ లోకి పోయిందా అంటున్నారు. లేక అమ్మ వారి దేవాలయ ప్రాంగణంలో జాతర నిర్వహణ ద్వారా ప్రతి ఏటా వచ్చే 1కోటి 36లక్షలు ఎక్కడ?ఎక్కడ చూసిన ఒక అవకతవకలు మరియు వారి లీలలు ఎన్ని రాసిన అంటూ ఉండదు అనడం సందర్భోచితం.
గిరిజన చట్టాలకు ఎగనామం
ఒకటా రెండా ఎన్ని గిరిజన చట్టాలు ఉన్నా వారికి చుట్టాలే అంటున్నారు. మొత్తం సమాజాన్ని,చట్టాలను తప్పు దోవ పట్టిస్తూ అవినీతితో రాజ్యమేలుతు కోట్లకు పడగెత్తారు అంటున్నారు.కోటమైసమ్మ అమ్మ వారి దేవాలయాన్ని అభివృద్ధి కాకుండా అడ్డు కట్ట వేశారు. అభివృద్ధి ఎందుకు చెయ్యడం లేదని సందేహం రావచ్చు.
అమ్మ వారి ఆలయం బాగా అభివృద్ధి అయితే మొత్తం లావా దేవీలు పూర్తి ప్రభుత్వ అధీనంలోనికి వెళ్ళిపోతాయానే భయం ఉంది అనే ప్రచారం నెలకొంది. ఆలయ చైర్మన్ పదవి పర్స వారి నుంచి విముక్తి చేసి భక్తులకు ఆలయానికి న్యాయం చేయాలని డిమాండ్ బాగా ఉంది.
రాజ్యాంగ పరంగా ప్రతి ప్రభుత్వం మార్పు చెందినప్పుడు చైర్మన్ను మారుస్తారు .కాబట్టి,పట్టాభి వారు అనుకున్నది సాగదు కాబట్టి,అమ్మ వారి దేవాలయ పరిధిలో ఉన్న భూమి 548 సర్వే నెంబర్ పై ప్రభుత్వం పూర్తి ప్రక్షాళన చేస్తుంది కాబట్టి యదా రాజా తదా ప్రజా అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. వారి పూర్తి అవినీతి భాగోతం బట్టబయలు అవుతుంది అనే సందేహాలు లేకపోలేదు.కాబట్టి ట్రస్ట్ పై పూర్తి నివేదిక ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి,ట్రస్ట్ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం వివరాలు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి, ట్రస్ట్ అధీనంలో అక్రమంగా పెట్టుకున్న భూములను ప్రభుత్వపరం చెయ్యాల్సి ఉంటుంది. ఫలితంగా గిరిజన చట్టం 1/70యాక్ట్ అమలు ఉన్న ప్రాంతంలో ఉన్నత వర్గానికి చెందిన పర్స వారి లూటి నడవదు.
ఈ పరిణామాల నేపద్యంలో అమ్మ వారి గుడి వెనకాల సంపాదన చేసుకున్న గుట్ట భాగోతం బయటకు వస్తుంది.ఇన్నాళ్లుగా ప్రభుత్వాన్ని అక్కదో పట్టించినందుకు, చట్టాన్ని తప్పు దారి పట్టించినందుకు అవసరం అయితే శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చేంతాడంతా, విప్పు కుంటూ పోతే విప్పలేని కఠిన చిక్కుముల్లంతా ఎన్నో కారణాలు ఉన్నాయి. అందుకే సదరు నేత చైర్మన్ గా ఉన్నటువంటి ఏ దేవాలయం అభివృద్ధికి నోచుకోలేదు అనే అపార్టు ఉంది.
అస్సలు అన్ని అవకతవకలకు పాల్పడి కూడ చట్టం నుండి ఎలా తప్పించుకున్నారు
ఇలాంటి ఎన్ని అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నా , వారికి జోలికి ఎవరు ఎందుకు వెళ్లడం లేదు. వారి అన్యాయాలు బయటకు ఎందుకు రావడం లేదంటే మొదట ఆయన చేసే పని ఏ పార్టీ అధికారంలో ఉంటె వారికి అనుకూలంగా ఉంటారు. ఏ పార్టీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉంటె ఆ ఎమ్మెల్యే తో సాన్నిహిత్యం కొనసాగిస్తారు. ఏ వానకు ఆ గొడుగు అన్నట్టు ఏ పార్టీ అధికారంలోనికి వస్తే వారి చెంతకు చేరిపోతారు. ఇక అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి, శక్తి పై ఎవరు మాత్రం ఎదురు నిలబడగలరు. ఏండోమెంట్ అధికారులు ఉన్నా కానీ నామ మాత్రమె .ఎందుకంటే వారు చెంతనుండగా మనకెలా చింత అన్నట్టు వారికి వారు చెప్పినట్టు లెక్క పత్రాలు చూపిస్తే కొంత గొప్ప .వారి పై కూడ రామయ్య వారు కనికరం చూపించి కొంత ఆర్థిక పరంగా మరియు వారి ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ లాంటివి అప్పనంగా దొరుకుతాయాని గుసగుసలు వినిపిస్తున్నాయి.
స్థానిక ప్రజల మనోగతం
ఇక స్థానిక ప్రజల ఎలా భరిస్తున్నారు అంటే స్థానిక గ్రామ పంచాయతీనే తన అధీనంలో పెట్టుకుని తన రాజ్యాన్ని విస్తరస్తున్న పరిస్థితి ఉంది..స్థానికదాదాపు మూడు నాలుగు గ్రామ పంచాయతీలు అన్ని గిరిజన పంచాయతీలే వారి అమాయకత్వంమె దొర వారికి ఆయుధం .గ్రామాల్లో కొంతమందిని తన అనుచరులుగా పెట్టుకొని , వారికి కొన్ని తాయిలాలు ఇస్తూ అలా తనకు వ్యతిరేకంగా ఎవరైనా ఇబ్బంది కలిగే సృష్టించే ప్రయత్నం చేస్తే అయనకు ఉన్నా అనుచరులను ప్రయోగం చేస్తాడు. ఆయన లేకపోతే దేవాలయం లేదు దేవుడు లేడు అన్నట్టు వారితో ప్రకటనలు ఇప్పించడం మరొక వింత.
సీఎం చొరవ చూపాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు
ఆలయాల అభివృద్ధికి దృష్టి పెట్టాలని డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నది. తక్షణమే ఇల్లందుపరలోనే ఉన్న దేవాలయాల అన్నిటిపై ఫొటోస్ పెట్టి తక్షణ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆలయాల ప్రక్షాళనకు తెరలేపి విచారణ జరిపి అభివృద్ధికి సహకరించాలని, విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించి భక్తుల మనోభావాలకు విలువ ఇవ్వాలని కోరుతున్నారు.