నందికొట్కూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో రూపొందించిన పోస్టర్, బుక్లెట్ను రాష్ట్ర పంచాయతీ వింగ్ కార్యదర్శి పూల్యాల నాగిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు మన్సూర్ భాష ఆవిష్కరించారు.
నందికొట్కూరు: నందికొట్కూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో రూపొందించిన పోస్టర్, బుక్లెట్ను రాష్ట్ర పంచాయతీ వింగ్ కార్యదర్శి పూల్యాల నాగిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు మన్సూర్ భాష ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిన అన్యాయాలను తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమై, ఉద్యోగులు, రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

