నీట్ పరీక్ష రద్దుపై పారదర్శక విచారణ జరగాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి..

విచారణ
Spread the love

నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

హైదరాబాద్: నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్ష రద్దుతో లక్షలాది మంది విద్యార్థుల్లో ఆందోళన నెలకొందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు షాక్‌కు గురయ్యారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును పేపర్ లీక్ ఘటనలు దెబ్బతీస్తున్న నేపథ్యంలో పరీక్షల విశ్వసనీయతను కేంద్రం కాపాడాలని రేవంత్ రెడ్డి కోరారు. పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు మళ్లీ ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే, నీట్ అక్రమాలపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని కోరారు.

పోటీ పరీక్షలు అవకాశాల వేదికగా ఉండాలే తప్ప విద్యార్థుల జీవితాలను నాశనం చేసేలా మారకూడదని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీక్ ఘటనలు వంటి వాటిల్లో బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య పోలిక ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చురకలు అంటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top