అంజనీ పుత్రుడైన హనుమాన్ జయంతి సందర్భంగా మిడ్తూరు మండలం చెక్కుచెర్ల బాట సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాన్ని స్వీకరించారు.
నందికొట్కూరు : అంజనీ పుత్రుడైన హనుమాన్ జయంతి సందర్భంగా మిడ్తూరు మండలం చెక్కుచెర్ల బాట సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నందికొట్కూరు శాసనసభ్యుడు గిత్త జయసూర్య స్వయంగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాన్ని స్వీకరించారు.
పూజ అనంతరం భక్తుల సౌకర్యార్థం ఆలయ సమీపంలో తాగునీటి బోరు ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “భక్తుల కోసం తాగునీటి సౌకర్యం కల్పించడం ఆనందదాయకం. స్వామివారి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి చెందాలి” అని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరప్రసాద్ రెడ్డి, యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, సుధాకర్ యాదవ్, పల్చని మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

