ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆశ్చర్యకర ఫలితాలను వెల్లడించే అవకాశం కనబడుతోంది. తమిళనాడులో త్రిముఖ పోటీ ఉత్కంఠభరితంగా మారగా, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దాటినట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆశ్చర్యకర ఫలితాలను వెల్లడించే అవకాశం కనబడుతోంది. తమిళనాడులో త్రిముఖ పోటీ ఉత్కంఠభరితంగా మారగా, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దాటినట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ టీవీకే పార్టీ గట్టి పోటీ ఇస్తోంది(Tamil Nadu Assembly Elections 2026) .
ప్రస్తుతం ట్రెండ్స్‌ను బట్టి విజయ్ నేతృత్వంలోని టీవీకే (Vijay TVK) 107 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత ఏడీఎంకే 74 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, అధికార డీఎంకే 50 స్థానాల లీడింగ్‌లో ఉంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు సాధించాలి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తుంటే విజయ్ టీవీకే పెద్ద పార్టీగా అవతరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు హంగ్ ఏర్పడే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ దూసుకుపోతోంది (West Bengal Assembly Elections 2026). ఊహించినదానికంటే మెరుగైన ప్రదర్శన చేస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 182 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్క్‌ను దాటింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ 107 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 148 సీట్లలో గెలుపొందాలి. ఈ లెక్క ప్రకారం బెంగాల్‌లో బీజేపీ మెజారిటీ సీట్లను గెలుచుకునే అవకాశం కనబడుతోంది.

