ఆమనగల్లు జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా నారం అరుణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనకు స్థానిక పోలీస్ అధికారులు ఘన స్వాగతం పలికి పూలమొక్క అందజేసి శాలువాతో సత్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్జి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా పారదర్శకంగా సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల పోలీస్ స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలు వెంకటేశ్వర్లు, జానకిరామ్ రెడ్డి, సైదిరెడ్డి, వేణుగోపాల్ రావు, ఎస్‌ఐ సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.