గ్రామీణ యువతకు ఆశాకిరణంగా సుంకిరెడ్డి

సుంకిరెడ్డి
Spread the love

గ్రామీణ యువత ప్రతిభకు తగిన అవకాశాల వేదికలను అందించాలనే సంకల్పంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదవ ఉచిత ఎస్ఐ & కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆమనగల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు.

ఆమనగల్ : గ్రామీణ యువత ప్రతిభకు తగిన అవకాశాల వేదికలను అందించాలనే సంకల్పంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదవ ఉచిత ఎస్ఐ & కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆమనగల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గ్రామాల్లో ప్రతిభ ఉంది కానీ అవకాశాలు మాత్రం నగరాలకే పరిమితమైపోయాయి. కోచింగ్ ఫీజులు కట్టలేక ఎన్నో కలలు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి. ప్రతి మండల కేంద్రంలో ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పాఠ్యాంశాలతో పాటు శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, మానసిక ధైర్యం పెంపొందించేలా పూర్తి స్థాయి అభ్యర్థులుగా తీర్చిదిద్దుతున్నాం” అని తెలిపారు.

అతిథులు మాట్లాడుతూ, “ఇది సాధారణ శిక్షణ కేంద్రం కాదు, గ్రామీణ యువత జీవితాలను మలిచే మహత్తర కార్యక్రమం. పేద విద్యార్థులకు ఇది ఆశాకిరణం” అని కొనియాడారు.

శిక్షణ కేంద్రంలో చేరిన విద్యార్థులు మాట్లాడుతూ, “మా పరిస్థితుల్లో కోచింగ్ ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు అదే శిక్షణ ఉచితంగా అందుబాటులో రావడం గొప్ప అవకాశం. ఉద్యోగం సాధించి కుటుంబాల ఆశలను నెరవేర్చుతాం” అని ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక ఏఎస్సై రాంరెడ్డి, సర్పంచ్ కళ్యాణ్, మాజీ ఎంపీటీసీ పంతు నాయక్, మాజీ సర్పంచ్ రచ్చ శ్రీరాములు, ఉపాధ్యాయులు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top