కొల్లాపూర్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
కొల్లాపూర్: కొల్లాపూర్ మండలం ఎన్మనబెట్ల గ్రామ మరియు తెల్లపలుగు తాండాకు చెందిన కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ఎన్మనబెట్ల మాజీ సర్పంచ్ మేకల నాగరాజు, మాజీ ఎంపీపీ నిరంజన్ రావు, మాజీ సర్పంచ్ పాశం నాగరాజు, కోళ్ళ వెంకటేష్, చటమోని సత్యనారాయణ, బేవిని పురుషోత్తం, శ్రీరామ్, పాశం పరుశురాం, గనాలు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.