. టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా చేతుల మీదుగా పదవీ బాధ్యతల స్వీకరణ
.యువతకు ఉద్యోగ కల్పన పై దృష్టి సారిస్తా
.గ్రామీణ ప్రాంతాలకు టాస్క్ సేవలను విస్తరిస్తా
.కల్వకుర్తి ప్రజలకు అందుబాటులో ఉంటా – సుంకిరెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సి.ఓ.ఓ.) గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఐటీ శాఖామాత్యులు శ్రీధర్ బాబుకి, సీఈఓ శ్రీకాంత్ సిన్హాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.టాస్క్ కార్యాలయంలో టాస్క్ సీఈఓశ్రీకాంత్ సిన్హా చేతుల మీదుగా, కల్వకుర్తి నియోజకవర్గ అభిమానుల, కార్యకర్తల సమక్షంలో సి.ఓ.ఓ. గా రాఘవేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, తన మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రాంతానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు సుంకిరెడ్డి కృష్ణా రెడ్డితో పాటు కల్వకుర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.