చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తెలుగుదేశంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. నీతి నిజాయితీలకు మారు పేరుగా నిలిచారు. అలాగే సమర్థవంతమైన నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో గత రాత్రి ఆయన విజయవాడ వెళ్లే క్రమంలో తుని రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్‌లో ఆయన సాధారణ ప్రయాణికుడిలా ప్లాట్ ఫామ్‌పై కూర్చున్నారు. ఆ సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెంట పోలీసులు, గన్‌మెన్లు సైతం ఎవరు లేరు. దీంతో అయ్యన్న పాత్రుడు సింప్లిసిటీ చూసి ప్లాట్‌పామ్‌పై సహచర ప్రయాణికులు సైతం నివ్వెరపోయారు.
చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తెలుగుదేశంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. నీతి నిజాయితీలకు మారు పేరుగా నిలిచారు. అలాగే సమర్థవంతమైన నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ప్రజా సమస్యలే పరమావధిగా ఆయన పని చేసుకుంటూ వెళ్లతారన్న సంగతి అందరికి తెలిసిందే.
చంద్రబాబు ప్రసంగంలో ప్రశంసలు…
ఇక గత జగన్ ప్రభుత్వ హయాంలో అయ్యన్నపాత్రుడిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. అయినా.. ఆయన ఏ నాడు వెనక్కి తగ్గలేదన్న విషయం సుస్పష్టం. ఒక విధంగా చెప్పాలంటే.. జగన్ ప్రభుత్వంపై ఆయన పెద్ద ఎత్తున ధర్మయుద్దమే చేశారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన అయ్యన్నపాత్రుడికి కించిత్ అవినీతి మరక కూడా లేదంటే అది ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత అయ్యన్నపాత్రుడుని టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై సీఎం చంద్రబాబు చేసిన ప్రశంసల ప్రసంగం అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
అయ్యన్నపాత్రుడిపై 23 కేసులు పెట్టిన జగన్ సర్కార్…
1957 సెప్టెంబరు 4వ తేదీన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చింతకాయల వరహాలు దొర, చెల్లాయమ్మ దొర. నాడు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా యువత రాజకీయాల్లోకి రావాలంటూ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో 25 ఏళ్ల అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
నాటి నుంచి నేటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఆయన విజయం సాధించారు. ఏ పదవి చేపట్టినా ఆ పదవికి ఆయన వన్నె తీసుకు వచ్చిన వ్యక్తిగా అయ్యన్నపాత్రుడు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత జగన్ ప్రభుత్వ హయాంలో అయ్యన్నపాత్రుడిపై 23 కేసులు పెట్టారు. అందులో 10 కేసులు సీఐడీ వాళ్లే పెట్టారు. అయినప్పటికీ ఆయన రాజీలేని పోరాటంతో ముందుకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే.