. బాలాజీ సింగ్ పై సొంత పార్టీలో కుట్ర జరుగుతుంది అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ.
. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు బాలాజీ సింగ్
. తమ అభిమాన నాయకుడిని ప్రజలకి దూరం చేసే కుట్ర జరుగుతుంది అని వాపోతున్న బాలాజీ సింగ్ అభిమానులు
కల్వకుర్తి : అధికార పార్టీలో ఉన్నా, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నా, బాలాజీ సింగ్ పేరు వినిపించడం లేదు, కనిపించడం లేదు. ఎన్నో సందర్భాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే, ప్రజల మద్దతు పొందే బాలాజీ సింగ్ గురించి ఇప్పుడు ఎందుకు చర్చలు జరగడం లేదని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆశ్చర్యపోతున్నారు.
తన సహజ శైలితో ప్రజల గుండెల్లో స్థానం పొందిన బాలాజీ సింగ్ పేరు అధికార పార్టీకి వచ్చాక ఎందుకు అంతర్‌ధానమైపోయిందనే ప్రశ్న అభిమానులను కంగారెక్కిస్తోంది. గతంలో పదవిలో లేకున్నా, కల్వకుర్తి మొత్తం ఆయన పేరు ప్రతిధ్వనించేది. కానీ ఇప్పుడు అతడిపై ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయా అని ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాలు చూస్తుంటే, రాజకీయాల్లో ఉంటే జనాల గుండెల్లో స్థానం సొంతం చేసుకోవడం కష్టమేమీ కాదు కానీ, అలాంటి స్థానం ఉన్న బాలాజీ సింగ్ పేరు ఇలా మాయమవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఎన్ని కుట్రలు జరిగినా, ఆయన తెలంగాణ ఉద్యమ నేతగా ఆయనకు ఉన్న అభిమానాన్ని మాత్రం ఎవరూ దూరం చేయలేరని అభిమానులు సోషల్ మీడియాలో తేల్చి చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమం కోసం విదేశాల్లో కంపెనీలను సైతం అమ్ముకొని ఉద్యమం కోసం కోట్ల రూపాయల ఆస్తులు కోల్పోయారని వారు చర్చించుకుంటున్నారు.
బాలాజీ సింగ్ సహకారంతో ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు అని కానీ తమ నాయకుడు నియోజకవర్గంలో ఉన్న స్వార్థ రాజకీయ నాయకుల వల్ల ఉన్నత శిఖరాలకు చేరుకోలేకపోతున్నాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు.