కొంచెం మోదం కొంచెం ఖేదం

ఖేదం
Spread the love

ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నుండి జడ్పిటిసిగా పోటీకి దారి తీసిన పరిణామాలు మరియు నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ గా ఐదు సంవత్సరాల ప్రజా జీవితంలో సాధించిన ప్రగతి,అనుభవాలపై కొంచెం మోదం కొంచెం ఖేదం అంటూ చైతన్యగలం ప్రతినిధితో ప్రత్యేక ఇంటర్వ్యూలో ముచ్చటించిన ఠాకూర్ బాలాజీ సింగ్.

స్థానిక సంస్థలపై గత ప్రభుత్వం అవలంబించిన వైఖరి పై పెదవి విరుపు.

తెలంగాణ ఉద్యమం కోసం మరియు ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో సింగపూర్,కెనడా వంటి దేశాల గ్రీన్ కార్డులను సైతం వదులుకున్న వైనం.

రాజకీయ ఉన్నత శిఖరాలకు చేరుకుంటారా ! లేక గత ప్రభుత్వంలో వలె ఇక్కడ కూడా సామాజిక సమీకరణాల ఊబిలో చిక్కుకుంటారా!!

స్థానిక సంస్థల సభ్యులకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి

గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల మితిమీరిన జోక్యం వల్ల జడ్పీ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రాలేదు అంటున్న బాలాజీ

రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి తద్యం

నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ గా సాధించిన విజయాలు మరియు ప్రజా జీవితం గురించి బాలాజీ సింగ్ మాటల్లో…

హైదరాబాద్ (చైతన్యగళం):నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ గా జూలై 4తో పదవీకాలం ముగిస్తున్న నేపథ్యంలో చైతన్య గళం దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఠాకూర్ బాలాజీసింగ్ మనసు విప్పి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పటి నుండి ఈరోజు వరకు ఎదురైన అనుభవాలు తెలియజేశారు.వ్యాపార రీత్యా విదేశాల్లో స్థిరపడ్డా తెలంగాణ మలిదశ ఉద్యమం నేపథ్యంలో కెనడా,సింగపూర్లో తనకు,తన కుటుంబ సభ్యులకు ఉన్న గ్రీన్ కార్డులను సైతం రద్దు చేసుకొని తనకు ఉన్న కంపెనీ మరియు ఇల్లువిక్రయించి మరీ తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ స్వదేశానికి వచ్చి కేసీఆర్ పిలుపుమేరకు నాటి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

రాష్ట్రమంతా తెలంగాణ ఉద్యమ ఉధృతంగా సాగుతుంటే ఉమ్మడి పాలమూరులో మాత్రం అప్పుడప్పుడే ఉద్యమం ఊపందుకుంటుంది.అలాంటి సమయంలో కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జిగా టిఆర్ఎస్ పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించిన బాలాజీసింగ్ ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు.గ్రామాల్లో తండాల్లో పర్యటించి టిఆర్ఎస్ జండా గ్రామాలకు పరిచయం చేశారు.అంతేకాకుండా యువతలో ఉద్యమస్ఫూర్తిని నింపి తెలంగాణ ఆవశ్యకతని ప్రజలకు వివరించి తెలంగాణ సమాజాన్ని జాగృత పరిచే అనేక కార్యక్రమాలు నిర్వహించారు.ఉద్యమం కోసం భూములు,ఆస్తులని సైతం విక్రయించారు. ఉమ్మడి పాలమూరులో ఉద్యమానికి ఒక ఊపు తీసుకొచ్చారు.

తెలంగాణ ఉద్యమం అనంతరం 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు నుండి బాలాజీ సింగ్ కల్వకుర్తి ఎమ్మెల్యేగా 80 నుండి 90 వేల కోట్ల మెజారిటీతో గెలుపొందుతారు అని అనేక బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రకటించారు.అంతేకాకుండా జిల్లా నుండి మొదటి ఎమ్మెల్యే టికెట్ బాలాజీకే అని కూడా ప్రకటించారు.అలాంటి తెలంగాణ కల సహకారమైన తరువాత హఠాత్తుగా టికెట్ని జైపాల్ యాదవ్ కి కేటాయించడానికి కారణాలు తదనంతర పరిణామాలు ఆయన వివరించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో తెలుగుదేశం నుండి టిఆర్ఎస్ లో చేరిన జైపాల్ యాదవ్ కి టికెట్ కేటాయించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది అని కేసిఆర్ బాలాజీ సింగ్ ను ఒప్పించి టికెట్ని జైపాల్ యాదవ్ కి కేటాయించారు. దానికి తాను అంగీకరించినప్పటికీ జైపాల్ యాదవ్ తాను బాలాజీ సింగ్ కి డబ్బులు ఇవ్వడంతో టికెట్ ఇవ్వడానికి అంగీకరించాడని దుష్ప్రచారానికి తెరతీశారు తప్పనిసరి పరిస్థితిల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వచ్చింది అని తాను పోటీల్లో ఉన్నందున జైపాల్ యాదవ్ ఐదవ స్థానానికి పరిమితమయ్యారని బాలాజీ తెలిపారు అనంతరం 2014 ఎన్నికల్లో విజయం సాధించిన కెసిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ముఖ్యమంత్రి హోదాల్లో సింగపూర్లో పర్యటించిన సమయంలో బాలాజీ సింగ్ పిలిపించుకొని ఖచ్చితంగా పార్టీకి పనిచేయాలని ప్రభుత్వంలో భాగస్వామి కావాలి అని పార్టీని ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని బాలాజీ సింగ్ కోరారు దీంతో బాలాజీసింగ్ తిరిగి టీఆర్ఎస్ కు కండువా కప్పుకున్నారు.

2014 నుండి 2018 వరకు బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన తెలిపారు.రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన జిల్లాల పునర్విభజన తరువాత ఆర్డిఓ డివిజన్ ఏర్పాటు జరిగింది కానీ కల్వకుర్తికి మాత్రం మొండి చేయి చూపారు నాటి పాలకులు దీంతో ఆర్డిఓ ఆర్డిఓ డివిజన్ సాధనే లక్ష్యంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో జే ఏ సి ఏర్పాటు జరిగింది. కల్వకుర్తి ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది.ఆ సమయంలో బాలాజీసింగ్ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే క్రమంలో రెండు రోజుల్లో ఆర్డీవో జీవితం డివిజన్ ప్రకటించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు వెంటనే స్పందించిన మంత్రులు కెసిఆర్ కి విషయం తెలియజేయడంతో ప్రభుత్వం నుండి సానుకూల ప్రకటన వచ్చి తక్షణం బాలాజీసింగ్ నాయిని నర్సింహారెడ్డి కమిటీని కలిసి వారికి సమస్యను వివరించాలని సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని హైకమాండ్ సూచించింది వెంటనే వెంటనే కమిటీని కలిసి సమస్యను వివరంగా చెప్పగా స్పందించిన ప్రభుత్వం ఆర్డిఓ డివిజన్ ని ప్రకటించింది అని తెలిసిన విషయమే. ఈ సందర్భంగా సంఘటనలని ఆయన గుర్తుచేశారు.

ఖేదం
ఖేదం

కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధికి కేటీఆర్ ని ఒప్పించి 15 కోట్ల రూపాయల ప్రత్యేక సాధించిన తీరుని బాలాజీ సింగ్ వివరించారు. ఇలా అభివృద్ధిలో కల్వకుర్తిని పట్టాలెక్కించిన బాలాజీ సింగ్ కి 2018 లో టికెట్ తద్యం అనుకున్న సమయంలో కేసీఆర్ మరియు కేటీఆర్ బాలాజీని బుజ్జగించి జెడ్పీ చైర్మన్ హామీ ఇచ్చి జైపాల్ యాదవ్ కి తిరిగి టికెట్ ఇచ్చి గెలుపు బాధ్యతని బాలాజీ భుజస్కందాలపై పెట్టారని దీంతో కల్వకుర్తి నలుమూలల సుడిగాలి పర్యటనలు చేసి శ్రమించి జైపాల్ యాదవ్ ని విజయతీరాలకు చేర్చినట్లు ఆయన తెలిపారు.ప్రభుత్వంలోకి రాగానే జడ్పీ చైర్మన్ హామీని కేసీఆర్ తుంగలో తొక్కినట్టు బాలాజీసింగ్ గుర్తు చేశారు.

రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో జడ్పీ వైస్ చైర్మన్ తో సరిపెట్టారని దానికి కూడా జైపాల్ యాదవ్ అడుగడుగునా అడ్డు పడుతూ జెడ్పిటిసిగా పోటీ చేసేందుకు రిజర్వేషన్లు ఎక్కడ అనుకూలంగా లేకుండా చేశారు దీంతో చారకొండకు మారాల్సి వచ్చింది. చారకొండ ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ మరువలేనని జడ్పిటిసిగా పోటీ చేసిన తనకి 68% ఓట్లతో తనను గెలిపించారని బాలాజీ సింగ్ తెలిపారు. జడ్పీ వైస్ చైర్మన్గా తనకు అవకాశం రావడంతో తన పరిధిలోని నిధులతో అగ్ర భాగం చాడ గుండా కల్వకుర్తి వెళ్ళండి మండలాలను అభివృద్ధికి పూర్తిగా సహకరించానని తెలిపారు ఈ కాలంలో తనపై కేసులు నమోదుకు జైపాల్ యాదవ్ విశ్వప్రయత్నాలు చేశారని తన అనుచరులను జైలు పాలకు చేశారని తనను కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారని అధిష్టానం పై గౌరవంతో అన్ని భరించారని బాలాజీ సింగ్ చెప్పుకోచ్చారు.

కొత్త జిల్లా కావడంతో మొదట జిల్లా పరిషత్ భవనం కూడా లేదు ఎక్కడో చెరువులో ఒక తాత్కాలిక భవనంలో ఆరు నెలలు వెలదీసినట్టు ఎస్సీ రిజర్వ్ జడ్పీ కావడంతో అప్పటి ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపించింది అని మంత్రి నిరంజన్ రెడ్డి ద్వారా పంచాయతీరాజ్ కార్యాలయంలో ఒక ఫ్లోర్ కేటాయించాలి అని ఎన్నిసార్లు కోరిన సదరు మంత్రి స్పందించకపోవడం లాంటి విషయాలను చైతన్య గళం ఇంటర్వ్యూ లో తెలిపారు. దాదాపు సంవత్సరం పోరాటం చేసిన తర్వాత తమకు కార్యాలయం కేటాయించారని జిల్లా పరిషత్ నిధులతో జిల్లా అభివృద్ధిలో భాగం అవ్వాలి అనుకున్న నిధులలేమిటో నిస్సహాయులుగా ఉన్నామని ఆయన తెలిపారు. పేరుకే అధికార పార్టీ అని రాజరిక పాలనతో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఆయన వాపోయారు ఎలాంటి అధికారాలు లేని అధికారిగా పార్టీగా మాత్రమే టిఆర్ఎస్ గెలిచిందని ఆయన ఎద్దేవా చేశారు.

కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థల గొంతు నొక్కారని ఆ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకి ఎంతో చేయాలి అనుకున్న కూడా నాటి ప్రభుత్వ వైఖరితో పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని ఆయన అన్నారు. కాగా కొన్ని కారణాలతో జడ్పీ చైర్మన్ తో ఒక నెల రోజులపాటు ఇన్చార్జి జెడ్పీ చైర్మన్గా సైతం బాలాజీ సింగ్ సేవలందించారు జెట్టి సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించాలి అనుకుంటే నాటి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు జోక్యంతో జడ్పిటిసి లను గొంతులను నొక్కారని ఆయన వాపోయారు.

ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో కేసీఆర్ నియంతృత్వ వైఖరి మరియు జైపాల్ యాదవ్ కక్ష సాధింపు చర్యల కారంగా టిఆర్ఎస్కు రాజీనామా చేసి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవితో గౌరవించింది అని ఎట్టి పరిస్థితుల్లో నియంత పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగించాలి అని దృఢ నిశ్చయంతో పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జిల్లా మొత్తాన్ని స్వీప్ చేయడంలో మరియు కల్వకుర్తి అచ్చంపేట నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేల విజయాల్లో కీలక భూమిక పోషించారు.

బాలాజీ కెసిఆర్ తన అహంభావంతో చేజేతులా టిఆర్ఎస్ ని నాశనం చేసుకున్నాడని తెలంగాణలో టిఆర్ఎస్కిక స్థానం లేదు అనడానికి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే ఉదాహరణ అని ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో పాటు 16% ఓట్ షేర్ కి టిఆర్ఎస్ పడిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన అందిస్తున్నామని తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అని బాలాజీ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రిగా పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ ఉన్నారని ఆయన కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేటాయించారు ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం భూ పరిశీలన కొనసాగుతుంది అని త్వరలో హైదరాబాద్ శ్రీశైలం రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది అని ఆయన గుర్తు చేశారు కల్వకుర్తి ప్రాంతంలోని ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వాన్ని కోరుతామని బాలాజీసింగ్ తెలిపారు. కల్వకుర్తి ప్రాంత ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్తానని,ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉంటానని బాలాజీసింగ్ తెలిపారు.

కల్వకుర్తి ప్రాంత అభివృద్ధి తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.గత ప్రభుత్వం నియంతృత్వ వైఖరి వల్ల స్థానిక సంస్థలు కోల్పోయాయని రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని ఆయన పేర్కొన్నారు.జడ్పీలకు ఇచ్చే మినరల్ ఫండ్ని సైతం కేసీఆర్ ప్రభుత్వం పక్కదారి పట్టించింది అని దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది అని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడని నిధులన్నీ కేవలం కాలేశ్వరం కోసం మాత్రమే కేటాయించారని కానీ కాసుల కక్కుర్తి ఇప్పుడు ప్రాజెక్టు ప్రశ్నార్ధకమయ్యింది అని అన్నారు.

ఇక జెడ్పిటిసిగా వైస్ చైర్మన్ గా సంతృప్తి చెందారా అని ప్రశ్నించగా కేసీఆర్ ప్రభుత్వ అనాలోచిత నియంతృత్వ వైఖరి వల్ల అసంపూర్తి అసంతృప్తి గానే ఉంది అని నాటి ఎమ్మెల్యేలు ఎంపీల వైఖరితో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అభివృద్ధి కమిటీ నియామకమే చేపట్టలేదని గోకారం రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పి కట్ట తెంపి పనులు అసంపూర్తిగా వదిలేయడంతో అక్కడి ప్రజల జీవనం దెబ్బతింది అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి దృష్టికి కుకారం సమస్యను తీసుకెళ్లినట్టు రేవంత్ రెడ్డి గారు త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తారు అని ఆయన హామీ ఇచ్చారు.

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింతులో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారు భూ నిర్వాసితుల నష్టపరిహారం బకాయిలు దాదాపుగా చెల్లించారని ఆయన తెలిపారు కాగా మనో చౌదరి ఐఏఎస్ సాకారంతో ప్రారంభించిన మన ఇసుక వాహనం కార్యక్రమం విజయవంతం అయ్యింది అని దానిది కూడా రాజకీయ జోక్యంతో ఇసుక దందాకి పధకం అడ్డుగా వస్తుంది అని అర్ధాంతరంగా నిలిపివేశారు దీంతో ప్రజలు కొంతమేర నష్టపోయారు అని ఆయన తెలిపారు మొత్తానికి గత ప్రభుత్వ వైఖరితో ఐదు సంవత్సరాల పదవీకాలం కొంచెం మోదం కొంచెం ఖేదం అన్నట్టు ఉంది అని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు, నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్ తెలిపారు.

కాగా 2028లో సార్వత్రిక ఎన్నికల బరిలో ఉంటారా అని ప్రశ్నించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ ఏ బాధ్యత ఇస్తే దాన్ని సమర్థంగా నిర్వహిస్తానని పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తానని బదులిచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యం అని మరోసారి పేర్కొన్నారు.

Back To Top