నోరు బాగుంటే జబ్బులు దరి చేరవు..ఎలాగో చుడండి

నోరు
Spread the love

దంతాలను ఎవరూ డొనేట్‌ చేయలేరు.. ఈ పద్ధతులు పాటిస్తూ జాగ్రత్తగా కాపాడుకోండి నోరు-దంతాలు బాగుంటేనే ఆహారాన్ని మంచిగా నమిలి మింగడంతో త్వరగా జీర్ణమై శక్తి వస్తుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటున్నారు దంత వైద్యులు. మనదేశంలో చాలా మంది ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. పలు వ్యాధుల ప్రారంభ సంకేతాలు, లక్షణాలను ముందుగా గుర్తిస్తే అరికట్టవచ్చు.

దంతాలు బాగుంటేనే ఆహారాన్ని మంచిగా నమిలి మింగడంతో త్వరగా జీర్ణమై శక్తి వస్తుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటున్నారు దంత వైద్యులు. మనదేశంలో చాలా మంది ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. పలు వ్యాధుల ప్రారంభ సంకేతాలు, లక్షణాలను ముందుగా గుర్తిస్తే అరికట్టవచ్చు. దంత వైద్యుడే తరుచూ ఇలాంటి లోపాలు మొట్టమొదట కనిపెడతారని అంటున్నారు ప్రముఖ దంత వైద్యనిపుణులు, డాక్టర్‌ కండె నిశాంక్.

మన దేశంలో అన్ని వయస్సుల వారు అనేక దంత సమస్యలు ఎదుర్కొంటున్నారని, దంత సమస్యలు ఇంత తీవ్రస్థాయిలో ఉన్నప్పుటికీ చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంటుందని చెబుతున్నారు. అవగాహన లోపం, కొన్ని రకాల అపోహలతో కూడా కొంతమంది చికిత్స మానుకొని దంత సంరక్షణపై నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్థిక కారణాలు, వైద్యులు అందుబాటులో లేకపోవడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం దంత వైద్య చికిత్సలో చాలా మార్పులు వచ్చాయి. నూతన చికిత్సా విధానంతో తక్కువ నొప్పి.. ఎక్కువ సౌకర్యవంతంగా మారాయి.

ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి పెద్ద వారి వరకు దంత సమస్యలు అధికమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బ్రష్‌ చేసుకునే విధానం, తినే ఆహారంపై సరైన శ్రద్ధ వహించకపోవడంతో దంతాలు పాడవుతున్నాయి. నేడు నేషనల్‌ డెంటిస్ట్‌ డే సందర్భంగా పలు చికిత్సా విధానాలపై ప్రత్యేక కథనం.

పుప్పళ్లు రాకుండా..
చికిత్స కన్నా నివారణ ఉత్తమం. పళ్లు పుచ్చిపోయాక చికిత్స కన్నా ముందు జాగ్రత్తగా నివారించడం మిన్న. చిన్న పిల్లలకు ఫిట్‌ అండ్‌ ఫిషర్‌ సీలెంట్స్‌ ద్వారా పుప్పళ్లు రాకుండా నిరోధించవచ్చు. ఇది సూక్ష్మక్రీములను పంటి లోపలికి వెళ్లకుండా రక్షణ కవచంగా పనిచేస్తాయి.

టీత్‌ వైటింగ్‌
మన పళ్లు తెల్లగా ఉంటే మనం నలుగురిలో హాయిగా నవ్వగలుగుతాం. ఫ్లోరోసిస్‌, ఇతర కారణాలతో పంటిపై గోధుమ రంగు మచ్చలు, చారలు ఏర్పడతాయి. వీటిని వీటెల్‌ బ్లీచింగ్‌ పద్ధతి ద్వారా తొలగించి పళ్లను తెల్లగా, అందంగా మెరిసేలా చేయవచ్చు.

లింగల్‌ ఆర్థో డొంటిక్స్‌
ఎత్తు, వంకర పళ్ల సవరణకు పూర్వం మెటల్‌క్లిప్స్‌ ఉపయోగించేవారు. ఈ మెటల్‌క్లిప్స్‌ పెట్టుకొని చాలా మంది బయటికి వెళ్లేందుకు అసౌకర్యంగా ఫీలయ్యేవారు. ఇందులో పళ్ల వెనుక భాగంలో క్లిప్స్‌ అమర్చి ఎత్తు, వంకర పళ్లను సవరిస్తారు.


సింగిల్‌ విజిట్‌ ఎన్‌డొంటిక్స్‌
ఇంతకుముందు రూట్‌కెనాల్‌ థెరపీకి మూడు నాలుగు సార్లు దంత వైద్యుడిని సంప్రదించాల్సి వచ్చేది. కానీ ఆధునిక పరిజ్ఞానంతో కేవలం ఒకే విజిట్‌లో ఆర్సీటీ పూర్తి చేయవచ్చు. ఇది చాలా సులువైన, సౌకర్యమైన పద్ధతి. దీంతో చాలా సమయం వృథా కాకుండా చూసుకోవచ్చు.

స్మైల్‌ డిజైనింగ్‌
ముత్యాల్లాంటి పళ్ల వరుస కలిగి ఉండాలని, తమ నవ్వు ఇతరులను ఇట్టే ఆకర్షించాలని నేటి యువత కోరుకుంటున్నది. ఇప్పుడు దంత వైద్యంలో స్మైల్‌ డిజైనింగ్‌కు బాగా ఆదరణ పెరిగింది. ఇది యువతకు వరంలా మారింది. పళ్లు, చిగుళ్లు, నోటి ఎముకకు కొద్దిపాటి మార్పులు చేసి పళ్ల సైజును, ఆకృతిని, మీ నవ్వుని మీకు కావాల్సినట్లుగా తీర్చిదిద్దుకోవడమే ఈ స్మైల్‌ డిజైనింగ్‌. ఏ వయస్సు వారైనా స్మైల్‌ డిజైనింగ్‌ చేయించుకొని అందమైన చిరునవ్వుని పొందవచ్చు.

కండె నిశాంక్ - దంత వైద్య నిపుణులు
కండె నిశాంక్ – దంత వైద్య నిపుణులు


డెంటల్‌ ఇంప్లాంట్స్‌
ఆధునిక వైద్యరంగం బోసి నోటికి చెల్లు చీటి రాసింది. ఎందుకంటే ఇప్పుడు ‘డెంటల్‌ ఇంప్లాంట్స్‌’ పరిజ్ఞానంతో పళ్లు ఊడిపోయిన చోటే చాలా వరకు సహజమైన పంటితో సమానంగా అంతే ధృడంగా అంతే మన్నికగా అంతే సౌక్యరంగా శాశ్వతంగా ఉండిపోయే దంతాన్ని సృష్టించగలుగుతున్నారు.

సౌకర్యం సుస్థిరం
పక్క పళ్లను ముట్టుకోకుండా, పన్ను ఊడినచోటే కొత్తగా కృత్రిమ దంతాన్ని అమర్చే విధంగా సమర్థ విధానమే డెంటల్‌ ఇంప్లాంట్స్‌. ఇందులో దంతం ఊడినచోటే ఎముకలోకి ఒక మర సీల వంటి ఇంప్లాంట్‌ను బిగించి అది స్థిరంగా కుదురుకున్న తర్వాత దాని మీద దంతాన్ని అమరుస్తారు. ఒకసారి ఇంప్లాంట్‌ బిగిస్తే అది తీసుకొని పెట్టుకునే అవసరం లేదు. అది పూర్తి సహజమైన దంతంలా శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే ఇంప్లాంట్స్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరిగింది.

దంతాలను డొనేట్‌ చేయలేం…
మానవుని శరీరంలో అత్యంత కీలమైనవి దంతాలు. ఇతరులకు వారి స్మైల్‌ను తెలియజేసేవి దంతాలే. మొత్తం 32 పళ్లు ఉంటేనే అందంగా కనిపిస్తారు. శరీరంలోని అవయవాలను డొనేట్‌ చేయొచ్చు. కానీ దంతాలను డొనేట్‌ చేసినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. దంతాలను రక్షించుకోవడం అందరి బాధ్యత. ముఖ్యంగా గుజ్జు పదార్థాలను తిన్న తర్వాత దంతాలను శుభ్రం చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top