దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది.
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు అస్సలు కనిపించట్లేదు. తనకు బెయిల్ మంజూరు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు రౌస్ అవెన్యూ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ రెండింటినీ కోర్టు కొట్టేసింది. దీంతో కవితకు మరో బిగ్ షాక్ తగిలినట్టయ్యింది. కాగా.. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేయడానికి అధిష్టానం కవితను స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేస్తూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని చెప్పినప్పటికీ రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మరోవైపు.. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ అర్హత ఉందన్న విషయాన్ని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఇదివరకే న్యాయస్థానం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ కవిత బెయిల్‌పై రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా.. తిరస్కరిస్తూ తీర్పును వెలువరించారు.
కాగా.. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే తీహార్ జైల్లో ఉన్న ఆమెను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. గత నెల 22న రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరుగ్గా న్యాయమూర్తి కావేరీ బవేజా తొలుత మే-02కు తీర్వు రిజర్వు చేశారు. అయితే మే-02న తీర్పు వస్తుందని అంతా భావించగా.. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు మే-06కు రిజర్వ్ అయ్యింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లో బెయిల్ పిటిషన్లపై తీర్పును మే-06న వెలువరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఒకవేళ కవితకు బెయిల్ లభిస్తే జ్యుడీషయల్ రిమాండ్ నుంచి మినహాయింపు లభిస్తుందని అందరూ భావించారు కానీ.. అదేమీ జరగలేదు. ఇప్పటికే పలుమార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరిస్తూనే ఉన్నది. ఆ మధ్య తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని బెయిల్ మంజూరు చేయాలని కోరినప్పటికీ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరగా కోర్టు తిరస్కరించింది.
షాకుల మీద షాక్‌లు!