ఆసక్తికరంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో

CM Revanth
Spread the love

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో- అన్ని స్థానాల్లో గెలుస్తామంటూ పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ హామీ,బిజెపి కెసిఆర్ చేసిన తప్పుల పై విజయ డంకా మోగిస్తూ ప్రచారం.

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో రూపొందించింది. జాతీయ మేనిఫెస్టో పాంచ్ న్యాయ్‌తో పాటు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలతో రూపొందించిన తెలంగాణ మేనిఫెస్టోని నేడు గాంధీభవన్‌లో విడుదల చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు మేనిఫెస్టోను విడుదల చేశారు. యువత, మహిళలే లక్ష్యంగా చేసుకుని రూపొందించిన జాతీయ మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను హస్తం పార్టీ చేర్చింది. తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోలో స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. విభజన హామీలు, రైల్వే ప్రాజెక్టులు, కేంద్ర విశ్వవిద్యాలయాలను ఇందులో చేర్చారు.

తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలు ఇవే..

  • ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాదులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM), హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి పక్కనుంచి రాపిడ్ (వేగవంతమైన) రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు.
  • హైదరాబాద్ మహానగరానికి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్ట్ పునఃప్రారంభం.
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా
  • నూతన ఎయిర్ పోర్టుల ఏర్పాటు
  • నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాదులో ఏర్పాటు- రామగుండం- మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు
  • కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు
  • నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు
    జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు
  • నాలుగు నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటు
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఏర్పాటు
  • భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్ఐ) క్యాంపస్ ఏర్పాటు.
  • నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు
  • అధునాతన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు
  • 73 & 74 వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచులకు నేరుగా బదిలీ
  • ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు
  • హైదరాబాద్- బెంగళూరు ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ – నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నుంచి నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్, సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు డ్రై పోర్టు ఏర్పాటు
  • హైదరాబాదులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు
  • అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక, వినోద కేంద్రం
  • మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా
  • పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ గతానికి భిన్నంగా జాతీయ మేనిఫెస్టో, ప్రాంతీయ మేనిఫెస్టో విడుదల చేసింది. అధికారంలో ఉన్న తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకంగా రాష్ట్రానికి మేనిఫెస్టో రూపొందించింది. జాతీయ స్థాయిలో ప్రకటించిన ఐదు న్యాయాలతోపాటు 23 అంశాలతో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది.
Back To Top