ప్రభుత్వ పాఠశాలలంటే చిన్న చూపు చూస్తారని భావించే పరిస్థితుల్లో, జూపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హైటెక్ సదుపాయాలతో అందరినీ ఆకట్టుకుంది. ఈ పాఠశాల నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదర్శ పాఠశాలగా నిలిచింది.
చారగొండ, అక్టోబర్ 24 : చారగొండ మండల పరిధిలోని జూపల్లి గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల హైటెక్ హంగులతో కార్పోరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో రూపాంతరం చెందింది.ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపులు చూస్తారని భావించే పరిస్థితుల్లో జూపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కార్పొరేట్ తరహ సదుపాయాలతో అందరినీ ఆకట్టుకుంది.
ఈ పాఠశాల సదుపాయాల్లో మాత్రమే కాదు పిల్లలు చదువులో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు అని వారి ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ఈ పాఠశాల సదుపాయాలు సౌకర్యాల విషయంలోనే కాదు విద్యార్థుల విద్యలోనూ జిల్లాలోని ప్రధమ శ్రేణిలో దూసుకుపోతుంది. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉన్నతికి కట్టుబడి ఉంది అని చెప్పడానికి ఈ పాఠశాలల ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

స్కూల్ హెడ్మాస్టర్ అంజయ్య మాట్లాడుతూ స్కూల్లో బాత్రూం,కిచెన్ షెడ్డు వంటి పెండింగ్ పనులు త్వరలో పూర్తి చేయిస్తామని ,పాఠశాలను మరింత అభివృద్ధి చేయించేందుకు తమ వంతు కృషి చేస్తాము అని తెలిపారు.
పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల వికాసానికి కృషి చేస్తున్న ఈ పాఠశాల ఉపాధ్యాయులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క పాఠశాల జూపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు.