ప్రపంచం చూపంతా ఈ సినిమాపైనే.. పిల్ల‌ల‌కు ఇక పండ‌గే.

సినిమా
Spread the love

మాములుగా హాలీవుడ్ చిత్రాల‌కు ఉండే క్రేజ్ స‌ప‌రేటు.. న‌చ్చితే సొంత లాంగ్వేజ్ సినిమాల‌కు మించి క‌లెక్ష‌న్లు ముట్ట‌జెబుతారు. ఈ విష‌యం ఇప‌ప‌ప్టికే చాలా సినిమాల విష‌యంలో రుజువైంది కూడా. ఇప్పుడు ఇదే కోవ‌లో ఇప్పుడు ఓ చిత్రం రాబోతుంది.

మాములుగా హాలీవుడ్ చిత్రాల‌కు ఉండే క్రేజ్ స‌ప‌రేటు.. న‌చ్చితే సొంత లాంగ్వేజ్ సినిమాల‌కు మించి క‌లెక్ష‌న్లు ముట్ట‌జెబుతారు. ఈ విష‌యం ఇప‌ప‌ప్టికే చాలా సినిమాల విష‌యంలో రుజువైంది కూడా. ఇప్పుడు ఇదే కోవ‌లో ఇప్పుడు ఓ చిత్రం రాబోతుంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ (Godzilla x Kong: The New Empire) మాత్ర‌మే.

ఎన్న‌డు లేనంత‌గా చాలా మంది ప్రేక్ష‌కులు ఈ చిత్రం విడుద‌ల కోసం వెయిట్ చేస్తున్నారు. గ‌తంలో అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ సినిమాకు ఎలా అయితే అభిమానులు ఎదురు చూశారో ఇప్పుడు అంత‌కుమించి అనేలా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగ‌ర్లీ వెయిట్ చేస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు. గ‌త వారం ప‌దిరోజులుల‌గా ఈ సినిమాపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ వీప‌రీతంగా న‌డుస్తోండ‌గా యూట్యూబ్‌లో అయితే వేలు, ల‌క్ష‌ల్లోనే వీడియోలు పెడుతున్నారు ఫ్యాన్స్‌.

అయితే.. హాలీవుడ్‌ చిత్రాల్లో ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ (Godzilla x Kong: The New Empire) చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఈ తరహా చిత్రాలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆదరిస్తారు. ఈ సిరీస్‌ల‌లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలు కాసుల వర్షం కురిపించాయి. అదే వ‌రుస‌లో ఇప్పుడు వస్తున్న మరో భారీ చిత్రం ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌ – ది ఎంపైర్‌’ (Godzilla x Kong: The New Empire) మూవీ. శుక్ర‌వారం (March 29)న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

గ‌త చిత్రాల‌కు మిన్న‌గా యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్ సీన్స్ ఈ సినిమాలో ఉంటుండ‌గా , గాడ్జిల్లాను మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్‌గా చూయించ‌నున్నారు. అలాంటి గాడ్జిల్లాను ఎదుర్కొవ‌డానికి కాంగ్ చేసే పోరాటాలు, మ‌ధ్య‌లో సైంటిస్టులు కాంగ్‌కు సాయంగా రావ‌డం త‌దిత‌ర ఆస‌క్తి అంశాల‌తో సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాకు ఆడమ్‌ వింగార్డ్‌ దర్శకత్వం వహించగా, లెజెండరీ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. ఈ చిత్రంలో రెబెకా హాల్‌, బ్రియాన్‌ టైరీ హెన్రీ, డాన్‌ స్టీవెన్స్‌, కైలీ హాట్లీ, అలెక్స్‌ ఫెర్న్స్‌, ఫలచెన్‌ తదితరులు నటించారు.

ఇందులో గాడ్జిల్లాకు(Godzilla x Kong: The New Empire) సరికొత్త రూపాన్ని ఇవ్వడం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘గతంలో వచ్చిన చిత్రాలకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించాం. ఈ సినిమా టైటాన్స్‌ చరిత్ర, వాటి మూలాలు, స్కల్‌ ఐలాండ్‌ అంతర రహస్యాలను మరింత లోతుగా విశ్లేషించేలా ఉంటుంది. ఈనెల 29వ తేదీన తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు.

ప్రధాన పాత్రను పోషించిన రెబాకా హాల్‌ మాట్లాడుతూ.. ‘ఆడమ్‌ వింగార్డ్‌ దర్శకత్వంలో నటించడం నాకు ఎపుడూ సంతోషమే. ఆయన అత్యంత ప్రతిభ కలిగిన దర్శకుడు. ఆయన షూట్‌ చేసే ప్రతి సన్నివేశం ఎంతో క్లియర్‌గా ఉంటుంది. ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులోని గ్రాఫిక్స్‌ను ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారు’ అన్నారు.

Back To Top