కల్వకుర్తి మండల పరిధిలో తాండ్ర గ్రామ సమీపాన కొండారెడ్డిపల్లి గేటు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా దుర్మరణం
కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామ సమీపాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటార్ సైకిల్‌పై కల్వకుర్తి నుండి కొండారెడ్డి పల్లి వైపు వెళ్తున్న స్వాతి (38) అనే మహిళను, దేవరకొండ వైపు నుండి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
స్వాతి భర్త బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి తెలిపారు.