బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపైఫోకస్ పెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రకు భారతీయ జనతా పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. 17 లోక్‌సభ స్ధానాలను నాలుగు క్లస్టర్స్‌గా భారతీయ జనతా పార్టీ విభజించింది. లోక్‌సభ క్లస్టర్స్‌లో 11 రోజుల పాటు బస్సుయాత్ర నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బస్సు యాత్ర చేయనుంది. రోడ్ షోలతో పాటు.. బస్సుయాత్రలో కార్నర్ మీటింగ్స్, బహిరంగ సభలు నిర్వహించనుంది. ఈ యాత్రలో రాష్ట్ర నేతలతో పాటు.. భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు కూడా పాల్గొంటారు. 35 శాతం ఓట్ షేర్‌తో పాటు.. పది సీట్లలో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందించింది.