నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ (Veldanda)మండలం గుండాల గ్రామంలోని కోనేరులో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన విషాదకర ఘటన ముగిసింది. వనపర్తి జిల్లా, మున్నూరు మండలానికి చెందిన విద్యార్థి ఉమేష్ (17) మృతదేహం మూడు రోజుల గాలింపు అనంతరం ఎన్డిఆర్ఎఫ్ (NDRF) బృందాల సహాయంతో బయటపడింది.
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ(Veldanda) మండలం గుండాల గ్రామంలోని కోనేరులో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన విషాదకర ఘటన ముగిసింది. వనపర్తి జిల్లా, మున్నూరు మండలానికి చెందిన విద్యార్థి ఉమేష్ (17) మృతదేహం మూడు రోజుల గాలింపు అనంతరం ఎన్డిఆర్ఎఫ్ (NDRF) బృందాల సహాయంతో బయటపడింది.

మహాశివరాత్రి సందర్బంగా దేవాలయ దర్శనం – అనుకోని ప్రమాదం
ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పురస్కరించుకొని గుండాల శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం జయప్రకాశ్ నగర్ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థుల బృందం ఆలయాన్ని సందర్శించింది. దర్శనం అనంతరం కొందరు విద్యార్థులు కోనేరులో స్నానం చేయడానికి దిగగా, ప్రమాదవశాత్తు ఉమేష్ నీటిలో గల్లంతయ్యాడు.
సహచర విద్యార్థులు, స్థానికులు వెంటనే స్పందించినా అతడిని కాపాడలేకపోయారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, మృతదేహం కనిపించకపోవడంతో ఎన్డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు.
మూడు రోజుల శ్రమ అనంతరం మృతదేహం వెలికితీత
మూడు రోజుల పాటు నిరంతరంగా గాలింపు చేపట్టిన ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, ఈ ఉదయం భారీ క్రేన్ సహాయంతో మృతదేహాన్ని వెలికితీశాయి. ఉమేష్ మృతదేహం బయటపడగానే తండ్రి రాములు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
గ్రామస్థుల ఆందోళన – కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతను నిర్లక్ష్యం చేసిన గురుకుల పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఉమేష్ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు కలిసి ఉమేష్ కుటుంబానికి
₹1 కోటి నష్టపరిహారం,కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

అధికారుల హామీతో ఆందోళన విరమణ
వెల్దండ(Veldanda) ఇన్‌చార్జి ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేస్తూ, అధికారుల నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబోమని గ్రామస్థులు తేల్చిచెప్పారు.
ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థి మృతి – భద్రతపై ప్రజల ఆందోళన
ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యార్థుల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ హాస్టళ్లలో పర్యవేక్షణ మెరుగుపరచాలని, విద్యార్థుల ఇష్టానుసారమైన విహార యాత్రలను పాఠశాల యాజమాన్యాలు గమనించి, కఠిన నియంత్రణలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
“ప్రభుత్వం విద్యార్థుల భద్రతపై మరింత శ్రద్ధ వహించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని” స్థానికులు, మృతుడి కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.