బెల్లం అక్రమ రవాణా కి కేంద్రబిందువు గా కల్వకుర్తి ఆర్టీసీ

కల్వకుర్తి
Spread the love

కల్వకుర్తి చైతన్య గళం స్పెషల్ డెస్క్ :
ఆర్టీసీ బస్సుల్లో బెల్లం అక్రమ రవాణా పేరుతో చైతన్య గళం పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనం కల్వకుర్తి ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఆర్టీసీ బస్సుల కేంద్రంగా అక్రమ దందాలు.

కల్వకుర్తి ఆర్టీసీ డిప్పో ఉద్యోగుల నిర్వాకం.

ప్రభుత్వం నిషేధించిన సరుకులు ప్రభుత్వ వాహనాల్లోనే యధేచ్చగా సరఫరా.

ఆర్టీసీ బస్సుల్లో బెల్లం అక్రమ రవాణా పూర్తిగా సహకరిస్తున్న ఆర్టీసీ సిబ్బంది.

ఆర్టీసీ బస్సుల్లో బెల్లం రవాణా కి అధికారుల అండ ?

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిర్భయంగా బెల్లం పట్టిక సరఫరా.

బెల్లం రవాణా తరహాలోనే మద్యం కూడా సరఫరా జరుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిఘా వైఫల్యం ?

చైతన్య గళం స్టింగ్ ఆపరేషన్ లో నివ్వెరపోయే విషయాలు.

చైతన్య గళం స్పెషల్ డెస్క్ :
ఆర్టీసీ బస్సుల్లో బెల్లం అక్రమ రవాణా పేరుతో చైతన్య గళం పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనం కల్వకుర్తి ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.వివరాల్లోకి వెళితే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఈ పథకానికి ప్రజల్లో విశేష స్పందన వచ్చింది.

అప్పటి నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల తాకిడి కూడా పెరిగింది అయితే ఈ పథకం అమలు తీరు మరియు ప్రజల స్పందన పైన చైతన్య గళం ఒక పరిశోధన ప్రారంభించింది ఈ పరిశోధనలో దిమ్మ తిరిగే విషయాలు తెలిసాయి. చాలావరకు ఆర్టీసీ ఉద్యోగులు ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరవేయడంలో శక్తివంతం లేకుండా పనిచేస్తున్నారు.

స్టింగ్ ఆపరేషన్
స్టింగ్ ఆపరేషన్

అయితే కొన్ని బస్సులు మాత్రం సీట్లు ఖాళీగా ఉన్నా కూడా ప్రభుత్వం నిర్దేశించిన బస్టాపుల్లో కూడా ఆగకుండా వెళ్తుండడంతో ‘‘దాల్మే కుచ్ కాలా హై ‘‘అన్నట్లు వ్యవహారంలో ఏదో తేడా ఉంది అని గ్రహించిన చైతన్యగలం స్టింగ్ ఆపరేషన్ కి శ్రీకారం చుట్టింది.

ఈ ఆపరేషన్ లో నివ్వరపోయే విషయాలు తెలిసాయి. బస్టాపుల్లో ఆగకుండా వెళ్తున్న బస్సుల్లో బెల్లం పట్టిక తదితర ప్రభుత్వ నిషేధిత సామాగ్రి రవాణా జరుగుతున్నట్టు తెలిసింది. కల్వకుర్తి పట్టణానికి చెందిన ఒక బెల్లం వ్యాపారి ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ కార్గో వాహనాలు ఆర్టీసీ ఉన్నతాధికారుల సహాయంతో రోజుకి ఐదు నుంచి పది క్వింటాళ్ల బెల్లం మరియు కొంత మొత్తంలో పట్టిక హైదరాబాద్ నుండి కల్వకుర్తికి ఆర్టీసీ బస్సుల్లో గుడ్డు చప్పుడు కాకుండా మూడు నెలల నుండి నిర్విరామంగా ప్రతి సోమవారం నుండి శనివారం వరకు తరలిస్తున్నట్టు తెలిసింది.

కాసులకు కక్కుర్తి పడి కొందరు ఆర్టీసీ ఉద్యోగులు ఈ అక్రమ వ్యాపారానికి పూర్తిగా సహకరించారు సదరు వ్యాపారి ప్రతిరోజు కల్వకుర్తి నుండి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి నల్గొండ ఎక్స్ రోడ్డులో దిగి ఆ బస్సు తిరిగి ఎంజీబీఎస్ నుండి కల్వకుర్తికి తిరుగు ప్రయాణంలో నల్గొండ ఎక్స్ రోడ్ చేరుకునే లోపు మలక్పేట్ మార్కెట్ నుండి బెల్లంని ఆటోలో తీసుకొని వచ్చి ఆర్టీసీ బస్ లో చేరవేస్తున్నాడు బెల్లం సరఫరాకి రాచమార్గం రూపొందించుకున్నాడు ప్రజల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పతకం ఆర్టిసి బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి మరియు ఆర్టీసీ సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.

కానీ ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో మాత్రం ఆర్టీసీ ఉద్యోగులు ఈ పథకానికి తూట్లు పొడిచి ప్రభుత్వం మరియు సంస్థ పేరు ప్రఖ్యాతలను మసకబాడేటట్టు చేస్తున్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా లెక్కచేయకుండా ప్రభుత్వ వాహనాల్లో నిషేధిత వస్తువులను రవాణా చేస్తుండడం చూస్తే అనేకమైన అనుమానాలకు తావిస్తోంది .

కల్వకుర్తి బస్ డిపోలో ఈ వ్యవహారం పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సదరు వ్యవహారంపై డిఎం వివరణ కోసం ప్రయత్నించగా మళ్లీ మాట్లాడతాను అంటూ సమాధానం దాటవేశారు దీనితో ఉన్నదా అధికారుల పాత్ర పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Back To Top