శనివారం ఎన్టిఆర్ భవన్లో భారత రత్న, మాజీ రాష్ట్రపతి, డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం వర్థంతి కార్యక్రమాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. కలాం చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
శనివారం ఎన్టిఆర్ భవన్లో భారత రత్న, మాజీ రాష్ట్రపతి, డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం వర్థంతి కార్యక్రమాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. కలాం చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజునాయక్ మాట్లాడుతూ డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలామ్ భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ. నిరుపేద కుటుంబంలో పుట్టి, పేపర్ బాయ్‌గా ఇంటింటికి పేపర్లు వేసిన కలామ్ గారు దేశంలోనే అత్యున్నత రాష్ట్రపతి పదవిని అధిష్టించడం వెనుక కఠోర పరిశ్రమే కారణం. భారత్‌ను అణుసత్తాక రాజ్యంగా తీర్చిదిద్దటంలో అబ్దుల్ కలాం పాత్ర మరువలేనిది. ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ యువతకు స్ఫూర్తి. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు భారత రాష్ట్రపతి అభ్యర్ధిగా డా. కలాం పేరును ఎన్డీయే పక్షాల తరపున శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకు చేరువ చేసిన ఘనత కలామ్‌దే. ప్రజలతో మమేకమై ప్రజారాష్ట్రపతిగా ఖ్యాతి గడిరచారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో ఆయన పేరుమీదే యువతకు ‘ప్రతిభ అవార్డులు’ అందజేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఎన్నికలలో రాక్షసపాలనను అంతమొందించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడ పోలంవరం, రాజధాని అమరావతిని నిర్మించి యువతకు ఉపాధి కల్పనను కల్పించే దిశగా చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. తెలుగుదేశం పార్టీ కలాం ఆశయాలకు అణుగుణంగా పని చేస్తుంది. భావితరాలు అబ్దుల్ కలాం ఆదర్శాల సాధన కోసం కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి యాదిలాల్, ఐటీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.ఎ. నాయుడు, తెలుగుమహిళా రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వి. సురేఖ, పార్టీ నాయకులు ఎం.వెంకటేష్‌గౌడ్, రాహుల్ గాంధీ, ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.