KLI డి82 కాల్వ అసంపూర్తి పనులు పూర్తి చేయించి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరు అందించాలని,ఆమనగల్లు ఆసుపత్రి 100 పడకలకు పెంచి ఆధునీకరించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డి82 కాల్వ అసంపూర్తి పనులు పూర్తి చేయించి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరు అందించాలని.ఆమనగల్లు ఆసుపత్రి100 పడకలకు పెంచి అధునాతన భవనాన్ని నిర్మించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
కాల్వ నిర్మాణానికి కోట్ల రూపాయలు నిధులు ఖర్చుచేసిన అసంపూర్తి పనుల మూలంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కల్వకుర్తి నియోజకవర్గం లో పలు సమస్యల గురించి ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రస్తావించారు.
కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ, ఆమనగల్లు, మాడుగుల మండలాల పరిధిలో 35 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2017 లో డి.82 కాల్వ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. రూ. 178 కోట్లు కాలువ నిర్మాణానికి కేటాయించగా రూ.160 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. కాగా వెళ్లడం మండలం చెరుకూరు వద్ద ఓ రైతు పొలానికి రూ .5 లక్షలు పరివారం అందించకపోవడం వల్ల 2018లో పనులు నిలిపివేశారని ఎమ్మెల్యే నారాయణరెడ్డి సభ దృష్టికి తెచ్చారు.
గత ప్రభుత్వం పట్టింపు లేని ధోరణి వల్ల ఐదేళ్లయిన పనులు పూర్తి కాలేదని, రైతులకు సాగునీరు అందకుండా పోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. కే ఎల్ ఐ డి…82 కాలువ అసంపూర్తి పనులు త్వరితగతిన పూర్తి చేసి రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు. అదేవిధంగా హాల్వ నిర్మాణానికి భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులకు అందించాల్సిన రూ .40 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
నాలుగు మండలాలకు కూడలి అయిన ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల నుంచి గత ప్రభుత్వం 10 పడకలకు కుదించిందని, దీంతో రోగులకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు ఆసుపత్రిని 50 పడగలకు పెంచుతున్నట్లు హడావిడిగా జీవో ఇచ్చిన క్షేత్రస్థాయిలో అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు ఆసుపత్రిని 100 పడకలకు పెంచి అధునాతన భవనాన్ని నిర్మించాలని కసిరెడ్డి కోరారు.
ఆమనగలు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం భూవివాదం కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిందని, భవన నిర్మాణానికి రూ.1. 50 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు . ఈ నేపథ్యంలో భూవివాదం పరిష్కరించి భవన నిర్మాణం పనులు పూర్తిచేసి విద్యార్థుల ఇబ్బందులు తీర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రస్తావించిన సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకుపోయి వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు.