నీటి లాగానే స్వచ్ఛమైన గాలి కూడా అమ్మకం మొదలు
మనం ఇప్పటికే నీటిని కొనుక్కుని తాగుతున్నాం.కాలుష్య స్థాయులు చూస్తుంటే మున్ముందు గాలిని కూడా కొనుక్కోక తప్పేలా లేదు. దీన్ని అంచనా వేసిన కమ్యూనికా అనే సంస్థ గాలిని అమ్మేస్తోంది.
ఇటలీలోని లేక్ కోమో సరస్సును ఆనుకుని ఉండే గ్రామంలో స్వచ్ఛమైన గాలిని తమ సీక్రెట్ ఫార్ములా ఎయిర్తో కలిపి 400 మి.లీ టిన్లలో రూ.907కి విక్రయిస్తోంది. ఆ గాలి పీల్చినవారి మనసు తేలికవుతుందని ఆ సంస్థ చెబుతోంది.