అర్హులైన వారు ఓటరు18 జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి: పవార్

పవార్
Spread the love

ఏప్రిల్ 1, 2024 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న ప్రతి యువత ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు.

సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎలక్టోరల్ అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.


పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్లను సూచించారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు రూపొందించిన తుది జాబితా విడుదల తర్వాత ఆయా జిల్లాలలో భారీగా కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు కొరకు దరఖాస్తులు రావటం పై వికాస్ రాజ్ ఆరా తీశారు. పార్లమెంట్ ఎన్నికలకు తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేసుకోవాలని, ఎన్నికల సిబ్బంది వివరాలు తీసుకొని ఎపిక్ నెంబరుతో సహా ఆన్లైన్ లో వివరాలు నమోదు చేయాలనీ తెలిపారు.

పోస్టల్ ఓటుకు ఈ వివరాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఆగ్జలరి పోలింగ్ స్టేషన్ ల అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ మాట్లాడుతూ తుది ఓటరు జాబితా ప్రచురించి అన్ని పోలింగ్ స్టేషన్లు, రాజకీయ పార్టీలకు పంపించడం జరిగిందన్నారు.

పవార్
పవార్


ఓటర్లు జాబితాను పరిశీలించుకొని తమ పేరు ఉందా లేదా ఏదైనా తప్పులు ఉన్నాయా పరిశీలించుకోవాలి అన్నారు. కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్న వారికి ఎపిక్ కార్డుల ముద్రణకు పంపడం జరిగిందని పోస్ట్ ద్వారా వారి ఇంటికి చేరుతాయని తెలిపారు. ఒకవేళ ఎవరిదైనా ఎపిక్ కార్డు పోగొట్టుకొని ఉంటే వారు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. చనిపోయిన ఓటర్లు, లేదా డూప్లికేట్ ఓటర్లు ఉంటే సంబధిత బి.ఎల్. ఒ లకు లేదా తహశీల్దార్లు ఫారం 7 ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు.

వనపర్తి జిల్లాలో తుది ఓటరు జాబితా విడుదల చేసిన తర్వాత ఇప్పటి వరకు 4431 దరఖాస్తులు వచ్చాయని ఇందులో ఫారం 6,7,8 ఉన్నట్లు తెలియజేశారు. ప్రతి దరఖాస్తును ఎ.ఈ.ఆర్ ఒ స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్హత ఉన్న వాటికి జాబితాలో చేర్చడం, డూప్లికేట్, మరణించిన, పోలింగ్ స్టేషన్ మార్పులను పరిష్కరించడం జరుగుతుందన్నారు.

ఇప్పటికే ఈ.వి.యం మొదటిస్థాయి పరిశీలన పూర్తి చేసుకోవడం జరిగిందని ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, ఆర్డీవో పద్మావతి, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు

Back To Top