అయోధ్య వాల్మీకి ఎయిర్‌పోర్టు’కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

వాల్మీకి
Spread the love

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య పట్టణంలో ఉన్న విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్‌’ అనే పేరు పెట్టాలనే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య పట్టణంలో ఉన్న విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్‌’ అనే పేరు పెట్టాలనే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అయోధ్య ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయం హోదా కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దీనివల్ల దేశ విదేశాలకు చెందిన యాత్రికులు, భక్తులు అయోధ్యకు తరలి వస్తారని.. తద్వారా అయోధ్య గొప్ప పుణ్యక్షేత్రంగానేగాక ఆర్థికకేంద్రంగానూ మారుతుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. క్యాబినెట్‌ నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ.. ‘పవిత్ర నగరం అయోధ్యను యావత్‌ ప్రపంచంతో అనుసంధానించటానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’ అని పేర్కొన్నారు. ప్రధాని అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో పలు ఇతర నిర్ణయాలు కూడా తీసుకున్నారు. భూ విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు సంబంధించిన ఐదు వేర్వేరు పథకాలను కలుపుతూ పృథ్వీ విజ్ఞాన్‌ అనే కొత్త పథకానికి క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

Back To Top