అయోధ్య రామాలయం అక్షింతల వితరణ

అయోధ్య
Spread the love

ఈరోజు హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ లో అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపు మేరకు RSS ,విశ్వహిందూ పరిషత్, బజరంగ్ధల్ తదితర హిందూ సంస్థల ఆధ్వర్యంలో రాముల వారి అక్షింతల పంపిణి కార్యక్రమం వైభవంగా జరిగింది, ప్రత్యేక పాత్రలో అక్షింతలు తీసుకుని ఇంటింటికి తిరుగుతూ శ్రీరామ నామ జపం పాడుతూ అక్షింతలను అందజేశారు.

ఈ సందర్భంగా స్థానిక సాయి బృందావన్ రెసిడెంసీలో మహిళలు పవిత్రమైన అయోధ్య రామాలయం అక్షింతలకు మంగళ హారతులు పట్టి స్వాగతించారు.జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ్ లీలా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఒక్కరూ 5 దీపాలు వెలిగించి పండగ వాతావరణం లో రామనామ జపం చేయాలని పంపిణీ దారులు భక్తులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో కండె సత్యం,నిర్మల,ప్రచారక్ నివార్జీ,సుధాకర్,నగర భాద్యత్ సాయి కృష్ణ,శ్రీకాంత్ జీ,ఆదిత్య తదితరులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Back To Top