సర్వాంగ సుందరంగా ముస్తాబైన దుర్గా భవానీ ఉత్సవ కమిటీ మండపం.
దుర్గాభవాన్ని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత ఆగమనానికి సర్వం సిద్ధం ఘనంగా ఏర్పాట్లు.
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని సాయి నగర్ కాలనీలో శ్రీ దుర్గా భవానీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. విజయదశమి సందర్భంగా పండగకి ముందు తొమ్మిది రోజులపాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు.
శ్రీ దుర్గా భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాలు చాలా ప్రత్యేకం.ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు మాలధారణ చేసి అత్యంత భక్తి శ్రద్ధగా పూజలు నిర్వహిస్తారు.
అక్టోబర్ 3న ప్రారంభం కానున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు.రేపు సాయంత్రం 6 గంటలకు స్థానిక గాంధీ చౌక్ వద్ద అమ్మవారి ఆగమన్ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. అఖ్యాతిగాంచిన మహారాష్ట్ర బ్యాండ్ తో పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా అమ్మవారికి స్వాగతం పలుకనున్నారు.
అమ్మవారి ఆగమనం లో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు,కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం అని నిర్వాహకులు పేర్కొన్నారు.