ఎమ్మెల్యే విజయ రమణారావు – అభివృద్ధి సంక్షేమ పథకాలపై గ్రామాలలో విస్తృత ప్రచారం కల్పించాలి

ఇందిరమ్మ
Spread the love

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ కే గార్డెన్స్ లో సంస్థాగత ఎన్నికల సందర్బంగా ఆదివారం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు …

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ కే గార్డెన్స్ లో సంస్థాగత ఎన్నికల సందర్బంగా ఆదివారం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు …

ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ గారు, సంగీతం శ్రీనివాస్ గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ…

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు రూ. 500 బోనస్, రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసిన గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు.

ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వడ్ల కట్టింగ్ లేకుండా తడిచిన, రంగు మారిన వడ్లను కొనుగోలు చేపించడం జరిగిందిని చెప్పారు. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ సంక్షేమ పథకాలను అమలు చేస్తలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారనీ మండిపడ్డారు. గ్రామాలలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బి ఆర్ ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఇంటికి, గడపకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని, కొన్ని గ్రామాలలో ఇప్పటికి కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఉన్నాడులే మన కోసం తిరుగుతాడు అనుకుంటారనీ అన్నారు. అలాంటి ఆలోచన మంచిది కాదన్నారు. గ్రామాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పథకాలపై నోరు విప్పకుంటే మీకే నష్టం జరుగుతుందన్నారు.ఎన్నికల ఎప్పుడూ వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలతో ధైర్యంగా వెళ్ళి ఓటు అడగాలిని అప్పుడే గెలుస్తారన్నారు. ఎమ్మెల్యే గా నేను గెలవడానికి ఎంత కష్టపడ్డారో మీరు గెలిస్తే ఎక్కువ సంతోషం నాకే ఉంటుందని తెలిపారు. మీ గెలుపు కోసం నా శాయశక్తుల కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలను గెలవాలన్నారు..

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్,మార్కెట్ చైర్మన్లు మినిపల ప్రకాష్ రావు, ఈర్ల స్వరూప, తిరుపతి రెడ్డి, గండు సంజీవ్ మరియు సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు మరియు మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్,సయ్యద్ మస్త్రత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దానాయక్ దామోదర్ రావు, అరె సంతోష్ మరియు మండలాల అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి,మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, గజానావేనా సదయ్య,చిలుక సతీష్,బొజ్జ శ్రీనివాస్, కడారి శ్రీనివాస్ మరియు టౌన్ అధ్యక్షులు అబ్బాయి గౌడ్,భూషణవేణి సురేష్ గౌడ్ మరియు మాజీ జడ్పీటీసీ లు, ఎంపీపీ లు మరియు సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మరియు అనుబంధ సంఘాల నాయకులు మరియు యూత్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top