ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు:జిల్లా కలెక్టర్ పవార్

కలెక్టర్
Spread the love

ఎన్నికల కమిషన్ ద్వారా మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణకు ప్రకటన జారీ చేయడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)తక్షణం అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు.

చైతన్య గళం న్యూస్ వనపర్తి జిల్లా :
ఫిబ్రవరి, 26న ఎన్నికల కమిషన్ ద్వారా మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణకు ప్రకటన జారీ చేయడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)తక్షణం అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు. వనపర్తి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు మంగళవారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎస్పీ, జిల్లా పోలీస్ అధికారులు , జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వెబెక్స్ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు .

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని పకడ్బందీగా అమలు చేయాలని 24/48/72 గంటల్లో తీసుకోవాల్సిన చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక అధికారి ఎలాంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల కోడ్ ను సమర్థంగా అమలు చేయడం అధికారుల బాధ్యత అని, ఎన్నికల కమిషన్ విడుదల చేసిన మార్గదర్శకాలను చదవి వాటిని తూ .చ.తప్పకుండా అమలు చేయాలన్నారు.

కోడ్ అమల్లోకి వచ్చిన తొలి 24 గంటల్లో ప్రతి ప్రభుత్వ కార్యాలయం లోపల, బయట ఎలాంటి రాజకీయ సంబంధిత పోస్టర్లు, చిత్రాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, క్యాలెండర్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలో నోడల్ అధికారిగా ఆర్డీవో బాధ్యత వహించాలని చెప్పారు.

కోడ్ అమల్లో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఏవైనా సమావేశాలు నిర్వహించాలనుకుంటే తప్పనిసరిగా జిల్లా ఎన్నికల అధికారి నుంచి రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాలని చెప్పారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వాహనాలను వ్యక్తిగత, రాజకీయ సంబంధిత పనులకు వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు రాజకీయ నాయకులను కలవడం కానీ, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ చేయవద్దు అన్నారు. ఎన్నికల క్యాంపెయిన్, రాజకీయ సమావేశాలను ఎస్.ఎస్. టి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా వీడియో తీయించాలని సూచించారు.


ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అందరూ బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ను ఎవరైనా ఉల్లంఘిస్తే ఆరి.పి.యాక్ట్ 129 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారి ద్రుష్టికి తీసుకురావాలని తెలియజేశారు.
ఇటీవల నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏవిధమైన ఎన్నికల కోడ్ ను అమలు చేయడం జరిగిందో అదే మాదిరి ఎన్నికల నియమావళిని ఎమ్మెల్సీ ఎన్నికలకు అమలు చేయాలని ఆదేశించారు.


ఈ వెబ్ ఎక్స్ సమావేశంలో జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి , పోలీస్ అధికారులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Back To Top