తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (TSSO) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో ఘనంగా జరిగాయి. శంషాబాద్ జూనియర్ కళాశాలలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మీసాల లక్ష్మీ నివాస్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
శంషాబాద్:
తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (TSSO) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో ఘనంగా జరిగాయి. శంషాబాద్ జూనియర్ కళాశాలలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మీసాల లక్ష్మీ నివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి మాజ్ పేట రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మీసాల లక్ష్మీ నివాస్ మాట్లాడుతూ, కొద్ది కాలంలోనే 10 లక్షల మంది సభ్యత్వాన్ని సాధించి విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సంఘం తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని పేర్కొన్నారు. “రాబోయే రోజుల్లో విద్యార్థుల పక్షాన నిలబడి కొట్లాడే శక్తివంతమైన సంఘంగా తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్
నిలుస్తుంది” అని ఆయన ఉద్ఘాటించారు.

రాష్ట్ర అధికార ప్రతినిధి మాజ్ పేట రమేష్ మాట్లాడుతూ, ఉద్యమాలకు కార్యక్రమాలు సిద్ధం చేసి విద్యార్థుల పక్షాన పోరాటాలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న సంఘం TSSO అని వివరించారు.ఈ వేడుకల్లో రాష్ట్ర నాయకులు మహేందర్, రవి ,గవర్నమెంట్ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

