Headline
గ్యాస్
గ్యాస్ లేక ఇండక్షన్? యుద్ధం, ధరల ఎఫెక్ట్ మధ్య సామాన్యుడి వంటగదికి ఏది సేఫ్ ?
చిరంజీవి
Gaddar Film Awards 2026: చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..
లలితా దేవి
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దాం – రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి
రష్యా
సంక్షోభంలో భారత్‌కు అండగా నిలిచిన రష్యా…
మావోయిస్టులు
మావోయిస్టులు గన్ దించి రాజ్యాంగ బాటలోకి రావాలి
ధర్మ
Bandi Sanjay – ధర్మ స్వేచ్ఛకు ప్రతీకమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ
వాసవి
Vasavi : ఘనంగా వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
ఆల్ఫోర్స్
Alforce – ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు ప్రమాదం డ్రైవర్ పరారీ
Telangana High Court
Telangana High Court – ప్రతిసారి టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

ఆ కారణంతోనే బీజేపీలోకి… ఆర్‌.కృష్ణయ్య

ఆర్‌.కృష్ణయ్య
Spread the love

చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. బీజేపీ పిలిచి రాజ్యసభ ఇచ్చిందని అన్నారు. సీఎం చంద్రబాబు తనను రాజకీయాల్లోకి పిలిచారని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు..

అమరావతి: రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్లు ప్రకియ పూర్తి అయింది. రాజ్యసభ అభ్యర్థులను బలపరిచేందుకు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. మూడు రాజ్యసభ అభ్యర్థులకు మద్దతు తెలిపేందుకు అసెంబ్లీకి 40 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడి నామినేషన్ కోసం పదిమంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. అయితే నామినేషన్ వేసిన సందర్భంగా బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పిలిచి రాజ్యసభ ఇచ్చిందని తెలిపారు.బీసీల కోసమే పోరాటం చేస్తానని చెప్పారు. ఎక్కడ ఉన్నా ఎప్పుడు బీసీల సమస్యల కోసం పోరాటం చేశానని గుర్తుచేశారు.

చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పిలిచి తనకు రాజ్యసభ టికెట్ ఇచ్చిందని అన్నారు. సీఎం చంద్రబాబు తనను రాజకీయాల్లోకి పిలిచారని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు..50 ఏళ్లు బీసీల కోసం పోరాటం చేశానని చెప్పారు. వైసీపీకి పార్టీలో మాట్లాడే అవకాశం తక్కువ అని.. బీసీల గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుందని పార్టీ మారానని తెలిపారు.బీజేపీ తనకు కొత్త కాదని.. తాను కండువా కప్పుకున్న మొదటి పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. పార్టీల కండువాలు వేసుకోలేదు. అన్ని పార్టీలు బీసీల కోసం న్యాయం చేస్తున్నాయని చెప్పారు. పార్టీలే తన దగ్గరకు వచ్చాయని బీజేపీ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు.

పోటీకి దూరంగా వైసీపీ

రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ నుంచి బీద మస్తాన్‌ రావు, సానా సతీశ్‌… బీజేపీ అభ్యర్థిగా ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేశారు. ముగ్గురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం కానుంది. కాగా తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య… గతంలో వైసీపీ తరఫున రాజ్యసభలో అడుగుపెట్టారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనను బీజేపీ తిరిగి రాజ్యసభకు పంపనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. కృష్ణయ్య సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. అటు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలను, పార్టీ సభ్యత్వాన్ని కృష్ణయ్య ఒకేసారి తీసుకున్నారు.

కొంతకాలం టీడీపీలో ఎంతో బాధించింది: బీదా మస్తాన్ రావు

రాష్ట్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థి బీదా మస్తాన్ రావు తెలిపారు. అనివార్య కారణాల వల్ల రెండున్నరేళ్లు తెలుగుదేశానికి దూరమయ్యానని అన్నారు. సొంతిల్లు లాంటి తెలుగుదేశంలో కొంతకాలం లేకపోవడం ఎంతో బాధించిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు కీలక పదవులు ఆపార్టీలో దక్కుతున్నాయని బీదా మస్తాన్ రావు తెలిపారు.

బాధ్యతతో నిర్వర్తిస్తా: సానా సతీష్

చిన్న వయస్సులోనే నాకు కీలక పదవి ఇచ్చి ప్రోత్సహించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చిన అవకాశాన్ని బాధ్యతతో నిర్వర్తిస్తానని సానా సతీష్ చెప్పారు.

సమర్థులకు కీలక పదవులు:జీవీ ఆంజనేయులు

పార్టీలో సమర్థుల్ని గుర్తించి అధినేత వారికి కీలక పదవులు ఇచ్చారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ మిత్ర పక్షాల ఐక్యతను ముందుకు తీసుకెళ్తామని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top