యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం.
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.కూరేళ్ల విఠలాచార్య గారిని ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ మరియు సంస్థ సభ్యులు
ఆచార్య కూరేళ్ల గ్రంథాలయం నందు సన్మానించడం జరిగింది. ఆర్టీఐ సతీష్ మాట్లాడుతూ గురువులు కూరేళ్ల విఠలాచార్య గారు మా సొంత గ్రామం కావడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు.
తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, ఆచార్య కూరేళ్ల గ్రంథాలయ స్థాపకుడు. సాహిత్యమే ఊపిరిగా ఐదు దశాబ్దాలుగా రచనలు సాగిస్తున్నాడు. కవిగా 22 పుస్తకాలను వెలువరించిన విఠలాచార్య, పదవీ విరమణ అనంతరం తన స్వగ్రామంలోని తన గృహంలో సుమారు రెండు లక్షల గ్రంథాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశాడు. కలలను నిజం చేసుకోవడానికి వయస్సు అడ్డుకాదని 86 సంవత్సరాల కూరేళ్ల విఠలాచార్య మనందరికీ ఆదర్శం అన్నారు. ఇప్పుడున్న యువత విఠలాచార్య గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ సభ్యులు రోశనగరి యాదయ్య, కళ్లెం ధర్మనీల, కోట సుధాకర్, కొండ మల్లేశం, లవణం ఉపేందర్, సిరా మహేష్, గంధమల్ల శ్రీనివాస్ , రవి, రమేష్, శ్రీకాంత్ ,ఆవనగంటి స్వామి, తాటిపాముల స్వామి తదితరులు పాల్గొన్నారు.