నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి: బాలాజీ సింగ్.

ఖేదం
Spread the love

నీట్ యువతపై మద్యం ప్రభావం క్రికెట్ బెట్టింగ్ తదితర అంశాలపై టీపీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్ కీలక వ్యాఖ్యలు.

హైదరాబాద్ (చైతన్యగళం): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష 2024లో అవకతవకలు జరిగాయి అని తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి బాలాజీ సింగ్ ఆరోపించారు బీహార్ లో పరీక్షకు ముందు రోజే ప్రశ్నాపత్రాలు అందినట్లు ఒప్పుకున్నట్టు సదరు అభ్యర్థులను విచారణకు హాజరవ్వాల్సిందిగా బీహార్ ఆర్థిక అవకతవకల నిరోధక బ్యూరో నోటీసులు జారీ చేసినట్లు నీట్ ప్రశ్నాపత్రం లీకైంది అనడానికి ఇదే ఉదాహరణ అని బాలాజీ సింగ్ అన్నారు.

ఇంత జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం మౌనముద్ర వహిస్తుంది అని బాలాజీ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేసి పూర్తి పారదర్శకతతో మళ్ళీ నిర్వహించి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాలి అని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షంలో విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని బాలాజీ సింగ్ హెచ్చరించారు.
ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై సైతం బాలాజీ సింగ్ స్పందించారు.
సమాజంలో కొందరు వ్యక్తులు విచక్షణ కోల్పోయి అక్రమాలకు పాల్పడుతున్నారని వాటిని ప్రభుత్వం ఖచ్చితంగా కట్టడి చేస్తుందన్నారు. నారాయణపేట జిల్లాలో జరిగిన హత్య విషయంపై స్పందించిన ఆయన దాయాదుల ఆస్తి తగదా ఒక వ్యక్తి ప్రాణాలు తీయడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది అని విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఎస్సైని సస్పెండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


యువతపై మాదకద్రవ్యాలు,మద్యం ప్రభావం అధికమవుతుంది అని గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రజలని ఆదాయం కోసం మద్యానికి బానిసలుగా మార్చారని దీంతో కొందరు విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారు అని పెద్దపల్లిలో జరిగిన ఉదాంతం, యూసఫ్ గూడా లో గంజాయి బ్యాచ్ వీరంగం దీనికి ఉదాహరణ అని ఆయన అన్నారు.
చైతన్య గలం దినపత్రికలో ప్రచురితమైన బెట్టింగ్ కథనంపై ఆయన స్పందించారు వనపర్తి లో ఈ స్థాయిలో బెట్టింగ్ జరుగుతుంది అని విషయం విస్మయం కలిగించింది అన్నారు బెట్టింగ్ ఆడిన యువకుడు తన పరివర్తనలో మార్పు తెచ్చుకొని ఆటకి దూరంగా ఉన్నా కూడా ఒక బుకీ చదర వ్యాపారి దుకాణం పై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు.

యువత ఈజీ మనీకి అలవాటు పడి కష్టం లేకుండా డబ్బు రావాలి అనే ఉద్దేశంతో బెట్టింగ్ పై ఆసక్తి కనుబరుస్తున్నారని లక్షల్లో డబ్బు పోగొట్టుకోవడమే కాకుండా తల్లిదండ్రుల కష్టపడి సంపాదించిన డబ్బుని విచక్షణ లేకుండా ఖర్చు చేస్తున్నారని బెట్టింగ్,జూదం,మద్యం, మాదకద్రవ్యాలు బారిన పడుతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మాదకద్రవ్యాలపై ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతుంది అని ఆయన ఉద్ఘాటించారు దశలవారీగా మద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం నియంత్రిస్తుంది అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలకు స్థానం లేదు అని బాలాజీసింగ్ అన్నారు.

నీట్
నీట్

డ్రగ్స్ అనే మాట వినిపించకూడదు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే పాలనాపరమైన నిర్ణయం తీసుకుంది అని బాలాజీసింగ్ వివరించారు. గుట్కా,పాన్ పరాక్ లాంటి వస్తువులను ఇప్పటికే నిషేధించామని ప్రజలకు హాని కలిగించే ఏ ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని బాలాజీ సింగ్ తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో మద్యం మాదకద్రవ్యాలు ఈ స్థాయిలో వినియోగానికి రావడంలో గత కెసిఆర్ ప్రభుత్వం కారణమని అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క అంశం లోను ఒక విధానం అనేది లేకుండా పాలన సాగించారు అని ఆయన ధ్వజమెత్తారు.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వమని ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ కల్చర్,బెట్టింగ్ లాంటి వ్యవహారాలకు చోటు లేదు అని బాలాజీ సింగ్ తెలిపారు బెట్టింగ్ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని బెట్టింగ్ మాఫియాని తెలంగాణలు లేకుండా చేస్తామని బాలాజీ సింగ్ పేర్కొన్నారు ఎందరో అమాయకులు బెట్టింగ్ డ్రగ్స్ వల్ల నాణ్యమైన జీవితం సాగించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .

యువత ఇలాంటి వాటి దరిచేరకుండా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని బాలాజీ సింగ్ అన్నారు. చిన్నతనం నుండే మానవతా విలువలు పెంచే విధంగా పాఠ్యాంశాలు రూపొందించాలని విద్యా శాఖకు సిఫార్సు చేస్తామని అన్నారు చిన్నతనం నుండే విచక్షణ జ్ఞానం పెంచే విధంగా పాఠ్యాంశాలు ఉండాలి అని వాటిపై విద్యాశాఖ దృష్టి సారించాలని ఆయన అన్నారు ప్రజల ధనమానప్రాణాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది అని అన్నారు.

Back To Top