పెరటి తోటలతో ఎన్నో ప్రయోజనాలు – ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ విద్య

పెరటి
Spread the love

జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నాలుగవ రోజు కార్యక్రమంలో భాగంగా మోజర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులు వెల్టూరు గ్రామంలో రైతు శ్రీకాంత్ శర్మ ఇంటి ఆవరణలో పెరటి తోటను ఏర్పాటు చేశారు.

జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నాలుగవ రోజు కార్యక్రమంలో భాగంగా మోజర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులు వెల్టూరు గ్రామంలో రైతు శ్రీకాంత్ శర్మ ఇంటి ఆవరణలో తోటను ఏర్పాటు చేశారు. పెరటి తోట ఏర్పాటు చేసుకొను విధానం మరియు పెరటి తోట పెంపకంలో మెలకువలను విద్యార్థులు గ్రామస్తులకు తెలియజేశారు. తీగ జాతి కూరగాయలు, ఆకు కూరలతో పాటు వంగ, మిరప మరియు బెండ విత్తనాలను పెరటి తోటలో నాటారు.తోట వల్ల ఎటువంటి రసాయన అవశేషాలు లేని శుభ్రమైన తాజా కూరగాయలు మనకు లభిస్తాయని, కూరగాయలు బయట కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చు ని కూడా ఆదా చేయొచ్చని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విద్య గ్రామస్తులకు వివరించగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ నాగ సింధు తోట పెంపకం గురించి గ్రామస్తులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన రైతులకు విత్తనాల కిట్ల ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విద్య ,విద్యార్థులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత

మోజర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం యూనిట్-2 నాలుగవ రోజులో భాగంగా వెల్టూరు గ్రామ వీధులలో పరిసరాలను శుభ్రం చేశారు. పరిసరాలు శుభ్రంగా ఉండడం వల్ల మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డా. విద్య మరియు విద్యార్థులు గ్రామ ప్రజలకు తెలియజేశారు.శుక్రవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పంచాయతీ సెక్రెటరీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Back To Top