గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి – ఎంపీడీవో శశికళ

ఇందిరమ్మ
Spread the love

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం విధించిన గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీడీవో శశికళ సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం విధించిన గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీడీవో శశికళ సూచించారు.

ఈశాల తక్కల్లపల్లి గ్రామంలో 102 ఇళ్లు మంజూరై, 6 పూర్తయ్యాయని, 24 స్లాబ్ దశలో, 72 బేస్మెంట్ దశలో ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 16లోగా ప్లాస్టరింగ్ పూర్తి చేసిన ఇళ్లకు బిల్లులు చెల్లిస్తామని, గడువులోగా పనులు పూర్తి చేయని లబ్ధిదారుల ఇళ్లు రద్దు చేసి అర్హులకు మంజూరు చేస్తామని హెచ్చరించారు.

గ్రామంలో త్రాగునీటి సమస్యలపై పైప్‌లైన్, ట్యాంక్‌ను తనిఖీ చేసి వేసవిలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ ఒడ్నాల జ్యోతి రాజు, ఎంపీఓ సుదర్శన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అఖిల, కార్యదర్శి కోడిజుట్టు సుభాష్, వార్డు సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top