బిజెపి శ్రేణులతో కలిసి ప్రధాని మన్ కి బాత్ వీక్షించిన దుబాల శ్రీనివాస్..

బిజెపి
Spread the love

కొదురుపాక 213 పోలింగ్ బూత్ బిజెపి శ్రేణులతో కలిసి ఆదివారం రోజున మన్ కి బాత్ కార్యక్రమాన్ని కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దూబల శ్రీనివాస్ వీక్షించారు.

కొదురుపాక 213 పోలింగ్ బూత్ బిజెపి శ్రేణులతో కలిసి ఆదివారం రోజున మన్ కి బాత్ కార్యక్రమాన్ని కరీంనగర్ అసెంబ్లీకన్వీనర్ దూబల శ్రీనివాస్ వీక్షించారు. ప్రోగ్రాం అనంతరం దుబాల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ భద్రాచలం మహిళలు మిల్లెట్లతో బిస్కెట్లు తయారు చేస్తున్నారని, అవి లండన్ కు కూడా ఎగుమతి అవుతున్నాయని , ఆ మహిళలే పర్యావరణ రహితమైన శానిటరీ ప్యాడ్స్ ను ఉత్పత్తి చేస్తున్నారని, మూడు నెలల్లోనే 40 వేల ప్యాడ్స్ ను తయారు చేశారని ప్రధాని మోదీ వారిని ప్రశంసించారనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఇటీవలి అంతర్జాతీయ యోగ డే ను యావత్ ప్రపంచం జరుపుకుందని ,యోగ నిత్యజీవితంలో భాగం కావడం, విశ్వవ్యాప్తి కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. భారత దేశంలో దాదాపు 95 కోట్ల మంది ఏదో ఒక సామాజిక రక్షణ పథకంతో లబ్ధి పొందుతున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపిందని ప్రధాని మోదీ నరేంద్ర మోడీ ఈ సందర్భంగా వివరించారని ఆయన తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీ 50 ఏళ్లు పూర్తవడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కి బాత్ లో ప్రస్తావించారని , ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్కరినీ స్మరించుకోని , రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా చెప్పారని దుబాల శ్రీనివాస్ అన్నారు.


ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు సారంపల్లి రాజు, V తిరుపతి ,వట్టల రాజు, J సంజీవరావు ,ఎస్ రాకేష్, ఏ సాయి ,అంజయ్య, పరశురాములు, రాజు, అనిల్ కుమార్, సురేష్, స్వామి, మహేష్ ,ప్రశాంత్ ,స్వామి, శ్రీనివాస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top