ఆమనగల్లు మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామకం పూర్తి

కో-ఆప్షన్
Spread the love

ఆమనగల్లు మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియ సోమవారం విజయవంతంగా పూర్తైంది. మున్సిపల్ కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా నలుగురిని ద్వారా ఎంపిక చేశారు.

ఆమనగల్లు మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియ సోమవారం విజయవంతంగా పూర్తైంది. మున్సిపల్ కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా నలుగురిని కో-ఆప్షన్ ద్వారా ఎంపిక చేశారు.

జనరల్ (మహిళ) నుంచి శ్రీమతి కండె సీతారాములమ్మ, జనరల్ నుంచి శ్రీ చుక్క అల్లాజీ గౌడ్, మైనారిటీస్ (మహిళ) నుంచి శ్రీమతి హలీమా బేగం, మైనారిటీస్ (సాధారణ) నుంచి శ్రీ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్‌లను సభ్యులుగా ఎంపిక చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్ అధ్యక్షత వహించగా, కమిషనర్ శంకర్ నాయక్ పర్యవేక్షణలో కార్యక్రమం సజావుగా సాగింది. వైస్ చైర్‌పర్సన్ గీతా ఆచారి, కౌన్సిలర్లు మోక్తాల వెంకటయ్య, ఎర్రవోలు మహేష్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ, సభ్యులు పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించాలని సూచించారు. చైర్మన్ పత్యా నాయక్ మాట్లాడుతూ, సమన్వయంతో పని చేస్తే మున్సిపాలిటీ అభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top