Headline
గ్యాస్
గ్యాస్ లేక ఇండక్షన్? యుద్ధం, ధరల ఎఫెక్ట్ మధ్య సామాన్యుడి వంటగదికి ఏది సేఫ్ ?
చిరంజీవి
Gaddar Film Awards 2026: చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..
లలితా దేవి
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దాం – రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి
రష్యా
సంక్షోభంలో భారత్‌కు అండగా నిలిచిన రష్యా…
మావోయిస్టులు
మావోయిస్టులు గన్ దించి రాజ్యాంగ బాటలోకి రావాలి
ధర్మ
Bandi Sanjay – ధర్మ స్వేచ్ఛకు ప్రతీకమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ
వాసవి
Vasavi : ఘనంగా వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
ఆల్ఫోర్స్
Alforce – ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు ప్రమాదం డ్రైవర్ పరారీ
Telangana High Court
Telangana High Court – ప్రతిసారి టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

రేషన్ డీలర్ యే బియ్యం కొనుగోళ్ల దారుడై

బియ్యం
Spread the love

యదేచ్ఛగా పీడీఎస్ బియ్యం కొనుగోలు

  • ముద్ర కొట్టు పైసా పట్టు అనే రీతిలో వ్యవహారం.
  • లబ్ధిదారులకు కిలోకి రూపాయలు 10 అందజేత చిన్న రభస జరగడంతో రూపాయలు 15 కి పెంపు
  • కొనుగోలు చేసిన బియ్యం బహిరంగ మార్కెట్ కి తరలింపు.
  • సదరు రేషన్ డీలర్ కి సొంత రైస్ మిల్ ఉంది అని వినికిడి
  • కల్వకుర్తి పట్టణం రేషన్ షాప్ నెంబర్ 1 లో వెలుగు చూసిన ఘటన.
  • లబ్ధిదారులు వీడియో తీయడంతో వ్యవహారం బహిర్గతం
  • స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల అండతో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
  • ఈ తరహా వ్యాపారం చేసే డీలర్ల లైసెన్సులు రద్దుచేసి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని కోరుతున్న ప్రజలు

కల్వకుర్తి : బహిరంగ మార్కెట్ కి తరలడం నిత్యం చూస్తూనే ఉన్నాం. రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుండి కొనుగోలు చేయడం బహిరంగ మార్కెట్లో ప్రైవేట్ వ్యక్తులు విక్రయించడం పాత పద్ధతి. ఇప్పుడు కొత్త ట్రెండుకి శ్రీకారం చుట్టారు రేషన్ మాఫియా.

స్వయంగా రేషన్ డీలర్లు లబ్ధిదారుల వేలిముద్రలు వేయించుకొని కిలోకి రూపాయలు పది నుండి రూపాయలు 15కి కొనుగోలు చేయడం ప్రారంభించారు.కొనుగోలు చేసిన బియ్యాన్ని నేరుగా బహిరంగ మార్కెట్ కి తరలిస్తూ కాసుల పంట పండిస్తున్నారు.

పట్ట పగలే రేషన్ దుకాణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను ఉద్దేశించి సరఫరా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని దుకాణదారుడు వినియోగదారుల వేలు ముద్రలను తీసుకొని బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ కాలనీలో రేషన్ దుకాణం నెంబర్-1 లో శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రేషన్ డీలర్ లబ్ధిదారులకు సరఫరా చేయాల్సిన పిడిఎస్ బియ్యాన్ని లబ్ధిదారుల వివరాలను డిజిటల్ యంత్రంలో పొందుపరిచి సదరు రేషన్ దుకాణంలోని యదేచ్ఛగా కిలో బియ్యానికి 10 రూపాయలు చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు.కాగా మార్కెట్లో అధిక ధరలు చెల్లిస్తున్నారని కొందరు డబ్బులు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రూపాయలు 15 చెల్లిస్తాను అని సదరు రేషన్ డీలర్ తెలిపినట్లు తెలిసింది.

ఈ తంతు మొత్తాన్ని ఒక లబ్ధిదారుడు తన సెల్ ఫోన్లు వీడియో తీయడంతో విషయం బయటకు పొక్కింది. సదరు డీలర్ పట్టపగలే తన షాప్ లో లబ్ధిదారుల నుండి నిర్భయంగా ప్రజా పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని కొనుగోలు చేస్తుండడం వెనక అతనికి స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అర్హులైన పేదలకు పంపిణీ చేయాల్సిన పిడిఎస్ బియ్యాన్ని రేషన్ డీలర్ లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయకుండా గత కొన్ని సంవత్సరాలుగా దర్జాగా బహిరంగ మార్కెట్ కి తరలించి లక్షల కొల్లగొడుతున్న పౌర సరఫరాల అధికారులు అటు చూసిన దాఖలాలు లేవని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఉదంతం పై విచారణ నిర్వహించి తక్షణమే రేషన్ డీలర్ లైసెన్సు ని రద్దు చేసి నిరుద్యోగ యువతకు రేషన్ షాపుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top