Site icon Chaithanya Galam News

రేషన్ డీలర్ యే బియ్యం కొనుగోళ్ల దారుడై

బియ్యం

బియ్యం

Spread the love

యదేచ్ఛగా పీడీఎస్ బియ్యం కొనుగోలు

కల్వకుర్తి : బహిరంగ మార్కెట్ కి తరలడం నిత్యం చూస్తూనే ఉన్నాం. రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుండి కొనుగోలు చేయడం బహిరంగ మార్కెట్లో ప్రైవేట్ వ్యక్తులు విక్రయించడం పాత పద్ధతి. ఇప్పుడు కొత్త ట్రెండుకి శ్రీకారం చుట్టారు రేషన్ మాఫియా.

https://telugu.chaithanyagalamnews.com/wp-content/uploads/2024/10/WhatsApp-Video-2024-10-06-at-18.02.39_65b6fdc5.mp4

స్వయంగా రేషన్ డీలర్లు లబ్ధిదారుల వేలిముద్రలు వేయించుకొని కిలోకి రూపాయలు పది నుండి రూపాయలు 15కి కొనుగోలు చేయడం ప్రారంభించారు.కొనుగోలు చేసిన బియ్యాన్ని నేరుగా బహిరంగ మార్కెట్ కి తరలిస్తూ కాసుల పంట పండిస్తున్నారు.

పట్ట పగలే రేషన్ దుకాణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను ఉద్దేశించి సరఫరా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని దుకాణదారుడు వినియోగదారుల వేలు ముద్రలను తీసుకొని బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో వెలుగు చూసింది.

https://telugu.chaithanyagalamnews.com/wp-content/uploads/2024/10/WhatsApp-Video-2024-10-06-at-18.02.40_49867d7c.mp4

వివరాల్లోకి వెళితే కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ కాలనీలో రేషన్ దుకాణం నెంబర్-1 లో శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రేషన్ డీలర్ లబ్ధిదారులకు సరఫరా చేయాల్సిన పిడిఎస్ బియ్యాన్ని లబ్ధిదారుల వివరాలను డిజిటల్ యంత్రంలో పొందుపరిచి సదరు రేషన్ దుకాణంలోని యదేచ్ఛగా కిలో బియ్యానికి 10 రూపాయలు చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు.కాగా మార్కెట్లో అధిక ధరలు చెల్లిస్తున్నారని కొందరు డబ్బులు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రూపాయలు 15 చెల్లిస్తాను అని సదరు రేషన్ డీలర్ తెలిపినట్లు తెలిసింది.

ఈ తంతు మొత్తాన్ని ఒక లబ్ధిదారుడు తన సెల్ ఫోన్లు వీడియో తీయడంతో విషయం బయటకు పొక్కింది. సదరు డీలర్ పట్టపగలే తన షాప్ లో లబ్ధిదారుల నుండి నిర్భయంగా ప్రజా పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని కొనుగోలు చేస్తుండడం వెనక అతనికి స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అర్హులైన పేదలకు పంపిణీ చేయాల్సిన పిడిఎస్ బియ్యాన్ని రేషన్ డీలర్ లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయకుండా గత కొన్ని సంవత్సరాలుగా దర్జాగా బహిరంగ మార్కెట్ కి తరలించి లక్షల కొల్లగొడుతున్న పౌర సరఫరాల అధికారులు అటు చూసిన దాఖలాలు లేవని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఉదంతం పై విచారణ నిర్వహించి తక్షణమే రేషన్ డీలర్ లైసెన్సు ని రద్దు చేసి నిరుద్యోగ యువతకు రేషన్ షాపుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

Exit mobile version