తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి – మంత్రి సీతక్క

సీతక్క
Spread the love

తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవాలని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వదిలేయకుండా కాపాడాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పిలుపునిచ్చారు.

తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవాలని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వదిలేయకుండా కాపాడాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పిలుపునిచ్చారు.

జిల్లా కేంద్రంలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీ నాయక్, కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శభరీష్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసి, పోషన్ పక్వాడా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పౌష్టికాహార పంపిణీని పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్లను అందజేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల వివరాలు, ఆహార పంపిణీ వంటి అంశాలను అంగన్వాడీ టీచర్లు యాప్‌లో నమోదు చేస్తారని, దీని ద్వారా పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, ఆరు ఏళ్ల లోపు బాలబాలికల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం, అవగాహన కల్పించడమే పోషన్ పక్వాడా లక్ష్యమని, ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 9 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top