అచ్చంపేట మండల పరిధిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు విడుదలయ్యాయి. మొత్తం 38 గ్రామపంచాయతీలలో 27 గ్రామపంచాయతీలు ఎస్టీ స్థానాలుగా, 9 గ్రామపంచాయతీలు అన్‌రిజర్వ్‌గా, రెండు గ్రామపంచాయతీలు ఎస్సీ స్థానాలుగా కేటాయింపు జరిగింది.

ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళా, ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళా, అన్‌రిజర్వ్ జనరల్, అన్‌రిజర్వ్ మహిళా విభాగాల వారీగా స్థానాలు కేటాయించబడ్డాయి. ఈ కేటాయింపులో ఆంజనేయ తాండ, బక్కలింగాయపల్లి, జోగ్య తండా, కన్య తండా, పద్మారం తండా, శివార్ తండా, దేవులతాండ, ఆకారం, ఐనోల్, సిద్దాపూర్, ఎద్దు మిట్ట తండా, గుంపనపల్లి వంటి గ్రామాలు ఎస్టీ జనరల్‌గా నిలిచాయి. చేదురు బావి తండా, దుబ్బ తండా, కిష్ట తాండ, కొర్ర తండా, మర్లపాడు తండా, ఘన్పూర్, మన్నె వారి పల్లి, బొమ్మనపల్లి, బుడ్డ తాండ, చెంచు పలుగుతాండా, దర్గా తాండ, పెద్ద తాండ, లక్ష్మాపూర్, చౌటపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలు ఎస్టీ మహిళా స్థానాలుగా కేటాయించబడ్డాయి.
పులిజాల, లింగోటం గ్రామాలు ఎస్సీ జనరల్‌గా, చెన్నారం పిఎన్ ఎస్సీ మహిళా స్థానంగా కేటాయించబడ్డాయి. సింగారం, హాజీపూర్, పల్కపల్లి, చందాపూర్ గ్రామాలు అన్‌రిజర్వ్ జనరల్‌గా, నడింపల్లి, రంగాపూర్, బోల్గేట్ పల్లి, అంకిరోనిపల్లి గ్రామాలు అన్‌రిజర్వ్ మహిళా స్థానాలుగా నిర్ణయించబడ్డాయి.